Kamareddy Bandh: కామారెడ్డి లో కొనసాగుతున్న బంద్..

Kamareddy Bandh: కామారెడ్డి లో కొనసాగుతున్న బంద్..

Phani CH

|

Updated on: Jan 06, 2023 | 1:20 PM

కామారెడ్డి మున్సిపాల్టీ మాస్టర్ ప్లాన్‌ మంటలు పుట్టించింది. ఏడాదికి రెండు పంటలు పండే భూముల్ని ఇచ్చేది లేదంటూ రైతులు ఆందోళన బాటపట్టారు. కలెక్టరేట్‌ ముట్టడితో టెన్షన్ టెన్షన్ పరిస్థితి నెలకొంది.

కామారెడ్డి మున్సిపాల్టీ మాస్టర్ ప్లాన్‌ మంటలు పుట్టించింది. ఏడాదికి రెండు పంటలు పండే భూముల్ని ఇచ్చేది లేదంటూ రైతులు ఆందోళన బాటపట్టారు. కలెక్టరేట్‌ ముట్టడితో టెన్షన్ టెన్షన్ పరిస్థితి నెలకొంది. కన్నెర్రజేసిన రైతుల నిరసన చివరకు రాజకీయ రంగు పులుముకుంది. కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు కదంతొక్కారు. దీంతో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పెద్ద సంఖ్యలో రైతులు, వాళ్ల కుటుంబసభ్యులు తరలిరావడంతో వారిని కట్టడి చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. మధ్యాహ్నం వరకు ధర్నా నిర్వహించిన రైతులు ఒక్కసారిగా బారికేడ్లు తోసుకుంటూ కలెక్టరేట్‌ లోపలికి దూసుకెళ్లారు.

 

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Palnadu Bus Accident: పల్నాడు జిల్లా పులిపాడులో స్కూలు బస్సు బోల్తా

ప్రేమంటే ఇదేరా.. ప్రియుడి స్థానంలో పరీక్ష రాసిన ప్రియురాలు.. ఎలా దొరికారబ్బా

రైలు పట్టాలపై ట్రక్.. దూసుకొచ్చిన గూడ్స్ ట్రైన్.. కట్ చేస్తే.. షాకింగ్ వీడియో

ఆ రెస్టారెంట్‌లో రెండో పెళ్లి చేసుకున్నవారికి స్పెషల్‌ డిస్కౌంట్‌.. ఎందుకంటే ??

యువతిపై దాడి చేసిన యువకుడి.. నిందితుడి ఇంటిని బుల్‌డోజర్‌తో కూల్చివేత !!

 

Published on: Jan 06, 2023 01:20 PM