EC Press Meet Live: దేశవ్యాప్తంగా మోగిన ఎన్నికల నగారా.. అమల్లోకి వచ్చిన ఎలక్షన్ కోడ్..
Election Commission

EC Press Meet Live: దేశవ్యాప్తంగా మోగిన ఎన్నికల నగారా.. అమల్లోకి వచ్చిన ఎలక్షన్ కోడ్..

| Edited By: Ravi Kiran

Mar 16, 2024 | 4:00 PM

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. లోక్‌సభతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. ఈసారి జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి కూడా తొలిసారిగా ఎన్నికల నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభలకు ఎన్నికలు జరుగనున్నాయి.

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుంది. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. లోక్‌సభతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. ఈసారి జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి కూడా తొలిసారిగా ఎన్నికల నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం శాసనసభలకు ఎన్నికలు జరుగనున్నాయి. అదేవిధంగా దేశంలోని వివిధ స్థానాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు సైతం షెడ్యూల్ విడుదల కానుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణంతో తెలంగాణలో ఖాళీ అయిన కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Published on: Mar 16, 2024 02:53 PM