Telangana Elections: ఈసారి దళితుల ఆశీర్వాదం ఎవరికి.? తెలంగాణ ఎలక్షన్స్ లో కీలకం.
ఎస్సీ వర్గీకరణ చేస్తామని స్వయంగా ప్రధాని మోదీనే తెలంగాణకు వచ్చి హామీ ఇచ్చారు. సో, ఇకపై ఏం జరగబోతోంది. మాదిగ సామాజికవర్గం ఓటర్లు ఎటువైపు ఉంటారు? బీజేపీకి గంపగుత్తగా ఓటు వేస్తారా? రాజకీయ విశ్లేషకులు మాత్రం ఆ అవకాశం లేదనే చెబుతున్నారు. ఎస్సీ వర్గీకరణపై అన్ని పార్టీలు హామీ ఇచ్చాయి, అన్ని పార్టీలు నాన్చుతూ వచ్చాయి. సో, మోదీ హామీ ఇచ్చినా కొత్తగా జరిగేదేం లేదనేది విశ్లేషకుల వాదన.
ఎస్సీ వర్గీకరణ చేస్తామని స్వయంగా ప్రధాని మోదీనే తెలంగాణకు వచ్చి హామీ ఇచ్చారు. సో, ఇకపై ఏం జరగబోతోంది. మాదిగ సామాజికవర్గం ఓటర్లు ఎటువైపు ఉంటారు? బీజేపీకి గంపగుత్తగా ఓటు వేస్తారా? రాజకీయ విశ్లేషకులు మాత్రం ఆ అవకాశం లేదనే చెబుతున్నారు. ఎస్సీ వర్గీకరణపై అన్ని పార్టీలు హామీ ఇచ్చాయి, అన్ని పార్టీలు నాన్చుతూ వచ్చాయి. సో, మోదీ హామీ ఇచ్చినా కొత్తగా జరిగేదేం లేదనేది విశ్లేషకుల వాదన. వైఎస్ ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. కాని, అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దీనిని సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వర్గీకరణ డిమాండ్‌ను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ ప్రకటించింది. 2014లో ఎన్నికలకు ముందు బీజేపీ కూడా ఇదే హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ దానిని నిలబెట్టుకోలేదు. ప్రత్యేక రాష్ట్రంతోనే దళితుల సాధికారత సాధ్యమవుతుందని ఉద్యమ సమయంలో బీఆర్‌ఎస్ చెప్పింది. నిజానికి ఒకడుగు ముందుకేసి అసెంబ్లీలో రెండు తీర్మానాలు చేసి కేంద్రానికి పంపింది. కాని, ఇప్పటి వరకు ఏదీ జరగలేదు. దీంతో ఎస్సీ వర్గీకరణ అనే అంశం అంత ఇంపాక్ట్ చూపుతుందా అనేది పెద్ద సందేహమే.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.