కోవిషీల్డ్ డోసుల మధ్య విరామ కాలాన్ని ఎందుకు పెంచామంటే..! కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వివరణ..:covishield gap video.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య విరామకాలాన్ని పొడిగించాలన్న నిర్ణయంలో ఎలాంటి పొరబాటు లేదని, పారదర్శకంగా..శాస్త్రీయ పరమైన డేటాపై ఆధారపడే దీన్ని తీసుకోవడం జరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. హర్షవర్ధన్ తెలిపారు
కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య విరామకాలాన్ని పొడిగించాలన్న నిర్ణయంలో ఎలాంటి పొరబాటు లేదని, పారదర్శకంగా..శాస్త్రీయ పరమైన డేటాపై ఆధారపడే దీన్ని తీసుకోవడం జరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా. హర్షవర్ధన్ తెలిపారు. ఈ గ్యాప్ ను మొదట 6 నుంచి 8 వారాలకు.. ఆ తరువాత 8 నుంచి..12.. అనంతరం 16 వారాలకు పెంచడంపై తలెత్తిన అయోమయంపై ఆయన స్పందిస్తూ.. నిపుణులందరి ఏకాభిప్రాయంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ట్వీట్ చేశారు. శాస్త్రీయ పరమైన డేటాను ఆధారంగా చేసుకుని, ఎలాంటి అరమరికలకు తావు లేకుండా ఈ విరామ కాలాన్ని పెంచాం…ఇండియాలో డేటా మెకానిజం విస్తృతంగా ఉంది..ఒక ముఖ్యమైన సమస్యను రాజకీయం చేయడం చాలా దురదృష్టకరం అని ఆయన పేర్కొన్నారు. ఇమ్యునైజేషన్ పై గల నేషనల్ టెక్నీకల్ అడ్వైజరీ గ్రూప్ చీఫ్ డా.ఎన్.కె. అరోరా ఇచ్చిన స్టేట్ మెంట్ ను ఆయన తన ట్విటర్ కు జోడించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: పక్షి తో కలిసి ఒకే ప్లేట్ లో భోజనం చేసిన మనిషి.. హృదయాలను కదిలిస్తున్న వైరల్ వీడియో :Bird eats the same plate with man Video.