Andhra Pradesh: ఇకపై తగ్గేదేలే.. సీమ సాక్షిగా సై.. ప్రచార బరిలోకి జగన్, చంద్రబాబు..

|

Mar 27, 2024 | 9:01 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రణం ఇవాళ్టి నుంచి మరో లెవల్‌కి వెళ్లబోతోంది. అవును, నిన్నటివరకూ ఒక లెక్క.. ఇవాళ్టి నుంచి మరో లెక్కలా ఉండబోతోంది. ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. ఇంకోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు.. ఈరోజు నుంచే స్టేట్‌వైడ్‌ టూర్స్‌ మొదలుపెట్టబోతున్నారు. ఈ మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు ఇడుపులపాయ నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రణం ఇవాళ్టి నుంచి మరో లెవల్‌కి వెళ్లబోతోంది. అవును, నిన్నటివరకూ ఒక లెక్క.. ఇవాళ్టి నుంచి మరో లెక్కలా ఉండబోతోంది. ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. ఇంకోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు.. ఈరోజు నుంచే స్టేట్‌వైడ్‌ టూర్స్‌ మొదలుపెట్టబోతున్నారు. ఈ మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు ఇడుపులపాయ నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. మేమంతా సిద్ధం పేరుతో చేస్తోన్న ఈ యాత్ర 21రోజులపాటు ఇచ్ఛాపురం వరకు సాగనుంది. మొదటిరోజు మొత్తంగా మొదటిరోజు 115 కిలోమీటర్లు సాగుతుంది జగన్‌ బస్సు యాత్ర.

నేటి నుంచి రాష్ట్రవ్యాప్త పర్యటనకు చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. ప్రజాగళం పేరుతో వరుసగా సభలు, రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఈరోజు పలమనేరు, పుత్తూరు, మదనపల్లిలో బాబు పర్యటించనున్నారు. ప్రతిరోజు 4 నియోజకవర్గాల్లో పర్యటించేలా రూట్‌మ్యాప్‌ సిద్ధం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..