CM Revanth Reddy Vs KCR: అసెంబ్లీలో శ్వేతపత్రం పై ఉత్కంఠ.! గత ప్రభుత్వం వైఫల్యాల ప్రస్తావన.
Cm Revanth Reddy Vs Kcr Excitement Over The White Paper In Telangana Assembly Live Video On 14 02 2024 Telugu Political Video

CM Revanth Reddy Vs KCR: అసెంబ్లీలో శ్వేతపత్రం పై ఉత్కంఠ.! గత ప్రభుత్వం వైఫల్యాల ప్రస్తావన.

|

Feb 14, 2024 | 10:11 AM

గత ప్రభుత్వం ప్రాజెక్టుల్లో వైఫల్యాలు, గణాంకాలు, వివరాలు, ఆధారాలతో సహా ఇప్పటికే ప్రజల ముందుంచిన రేవంత్ ప్రభుత్వం.. మరో కీలకమైన దిశగా అడుగు వేసింది. సాగునీటి రంగంలో బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై సమగ్ర వివరాలతో శ్వేతపత్రాన్ని అసెంబ్లీ వేదికగా విడుదల చేసేందుకు రెడీ అయింది. మేడిగడ్డ డ్యామేజీని వివరించడానికి నిన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక టూర్ నిర్వహించిన ప్రభుత్వం..

గత ప్రభుత్వం ప్రాజెక్టుల్లో వైఫల్యాలు, గణాంకాలు, వివరాలు, ఆధారాలతో సహా ఇప్పటికే ప్రజల ముందుంచిన రేవంత్ ప్రభుత్వం.. మరో కీలకమైన దిశగా అడుగు వేసింది. సాగునీటి రంగంలో బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై సమగ్ర వివరాలతో శ్వేతపత్రాన్ని అసెంబ్లీ వేదికగా విడుదల చేసేందుకు రెడీ అయింది. మేడిగడ్డ డ్యామేజీని వివరించడానికి నిన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక టూర్ నిర్వహించిన ప్రభుత్వం.. ఇవాళ బడ్జెట్ సెషన్‌లో ఇరిగేషన్ వైట్ పేపర్ పేరుతో మరికొన్ని వివరాలను బుక్‌లెట్ రూపంలో టేబుల్ చేసేలా షెడ్యూల్ ఖరారు చేసింది. ఇప్పటికే ఆర్థిక, విద్యుత్ రంగాలపై ప్రభుత్వం శ్వేత పత్రాలను విడుదల చేసింది. లేటెస్ట్‌గా ఇరిగేషన్‌ విషయంలోనూ వైట్‌ పేపర్ రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. మంత్రి ఉత్తమ్ కుమార్ అన్ని అంశాలను వివరించడంతో పాటు సభ్యుల అభిప్రాయాలను తెలుసుకునేలా చర్చకు అవకాశం ఇవ్వనున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Feb 14, 2024 10:07 AM