Revanth Reddy: సీఎంను అగౌరవపరిచేలా మాట్లాడుతున్నారు.. బీఆర్ఎస్ నేతలపై రేవంత్ రెడ్డి మండిపాటు
సీఎంను అగౌరవపరిచేలా బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతున్నారంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ నేతలు పదేపదే భాష గురించి మాట్లాడుతున్నారని.. మాజీ సీఎం నిన్న నల్గొండలో మాట్లాడిన భాషపై చర్చిద్దామా? అని ప్రశ్నించారు. ఒక సీఎంను పట్టుకుని పీకనీకి పోయారా అని అంటారా? అంటూ మండిపడ్డారు.
సీఎంను అగౌరవపరిచేలా బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతున్నారంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ నేతలు పదేపదే భాష గురించి మాట్లాడుతున్నారని.. మాజీ సీఎం నిన్న నల్గొండలో మాట్లాడిన భాషపై చర్చిద్దామా? అని ప్రశ్నించారు. ఒక సీఎంను పట్టుకుని పీకనీకి పోయారా అని అంటారా? అంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు మొన్నటి ఎన్నికల్లో మీ ప్యాంటు పీకేశారని ఎద్దేవా చేశారు. తెలంగాణ సమాజం పట్ల, రైతుల పట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్షం మేడిగడ్డకు వచ్చేదన్నారు. కాళేశ్వరంపై, నదీ జలాలపై చర్చకు తాము సిద్ధమన్నారు. ప్రతిపక్ష నేత అసెంబ్లీకి వస్తే ప్రాజెక్ట్‌లపై ఎంత సేపైన చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు సీఎం. మేడిగడ్డ కుంగిపోతే.. అందులో నీళ్లు నింపడానికి అవకాశం ఉంటదా? కడియం శ్రీహరి, హరీష్ లకే పెత్తనం ఇస్తాం.. నీళ్లు నింపి చూపించాలన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై శ్వేత పత్రం పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాళేశ్వరంపై కూడా మేం చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు.