AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ముక్కుసూటి ప్రశ్నలు.. బుల్లెట్ల లాంటి సమాధానాలు.. రేవంత్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ

Telangana: ముక్కుసూటి ప్రశ్నలు.. బుల్లెట్ల లాంటి సమాధానాలు.. రేవంత్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ

Ram Naramaneni
|

Updated on: May 10, 2024 | 8:22 AM

Share

ఖమ్మం టికెట్‌పై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు సీఎం రేవంత్‌. భట్టి, పొంగులేటి కుటుంబాలకి కాకుండా లాయల్‌గా ఉండేవాళ్లకు ఇవ్వమని సోనియా సూచించారన్నారు. తాను మండవకి టికెట్ ఇవ్వాలని సూచన చేశానన్నారు. రేణుకాచౌదరి గడప దాటకుండా రాజ్యసభ సీటు వచ్చిందని.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి మంత్రి పదవి వచ్చిందన్నారు. రేవంత్ ఫుల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం....

హార్డ్ డిస్క్‌ల మాయంపై తీగలాగితే ఫోన్‌ ట్యాపింగ్ బయటపడిందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారాన్ని అసెంబ్లీలో బయటపెడతామన్నారు. ఆధారాలు లేకుండా ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వనన్నారు. ఎవరు ఏ ఉద్దేశంతో ట్యాపింగ్ చేశారో తెలియాల్సి ఉందన్నారు. అంతిమంగా ఎవరు ఆదేశాలు ఇచ్చారు ? సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్నది తేలుస్తామన్నారు సీఎం. కాంగ్రెస్ పాలనలో పొలిటికల్ ట్యాపింగ్‌కి అవకాశం లేదని తేల్చిచెప్పారు.

రైతు భరోసా నిధులు మొత్తం విడుదల చేశామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. 69 లక్షల మంది రైతులకు రైతుభరోసా అందించామన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీకి నెలకు 350 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీకల్లా జీతాలిస్తున్నామన్నారు. కేసీఆర్‌ బకాయిలు పెట్టి వెళ్లిపోయారని.. 5 నెలల్లో 30 వేల కోట్ల వడ్డీ చెల్లించామన్నారు రేవంత్.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ ఉండదన్నారని.. రేవంత్‌ రాజకీయ జీవితం క్లోజ్‌ అంటూ దుష్ప్రచారం చేశారన్నారు సీఎం. కాంగ్రెస్‌లో స్వేచ్ఛ ఎక్కువని.. ఎవరైనా సీఎం సీటు ఆశించవచ్చన్నారు. అనుభవాన్ని బట్టి పార్టీ అవకాశాలిచ్చిందన్నారు. ఎవరినీ ఇబ్బంది పెట్టాలని చూడటం లేదని.. ఇబ్బంది లేనప్పుడు వ్యతిరేకంగా ఎలా పనిచేస్తారన్నారు. నేతలందరికీ అందుబాటులో ఉంటున్నానని.. రోజుకి కనీసం వెయ్యి మందిని కలుస్తున్నానన్నారు సీఎం రేవంత్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: May 10, 2024 08:21 AM