CM KCR Nomination: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో భారత రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్ రావు స్పీడును పెంచారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తాను పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో ఇవాళ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయన నామినేషన్ పత్రాలతో కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి సన్నిధిలో పూజలు నిర్వహించారు. గజ్వేల్‌లో రెండు సెట్ల నామినేషన్లను రిటర్నింగ్ అధికారికి కేసీఆర్ సమర్పిస్తారు. గజ్వేల్ తర్వాత కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేస్తారు. నామినేషన్ సమర్పించిన తర్వాత బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు.
ఈ మేరకు సీఎం కేసీఆర్ గజ్వేల్ చేరుకున్నారు. గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేస్తున్నారు. దీనికి సంబంధించి లైవ్ వీడియోను వీక్షించండి..
గజ్వేల్ లో సీఎం కేసీఆర్ నామినేషన్ కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. దీంతో గజ్వేల్ గులాబీ మయం అయింది. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..