Jagtiyal: కొడుకు పొమ్మన్నాడని.. 82 ఏళ్ల వృద్ధురాలు ఎన్నికల్లో నామినేషన్.. వీడియో.
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ 82 ఏళ్ల వయసున్న బామ్మ తాజాగా నామినేషన్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలకు చెందిన చీటి శ్యామల జగిత్యాలలో నివాసం ఉంటున్నారు. ఆమె స్వాతంత్ర్య సమరయోధుడు మురళీధర్ రావు భార్య కూడా. వృద్ధాప్యంలో తాను నామినేషన్ వేయడానికి ఓ బలమైన కారణం ఉందని అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ 82 ఏళ్ల వయసున్న బామ్మ తాజాగా నామినేషన్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాలకు చెందిన చీటి శ్యామల జగిత్యాలలో నివాసం ఉంటున్నారు. ఆమె స్వాతంత్ర్య సమరయోధుడు మురళీధర్ రావు భార్య కూడా. వృద్ధాప్యంలో తాను నామినేషన్ వేయడానికి ఓ బలమైన కారణం ఉందని అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తమ కుటుంబానికి చెందిన ఇంటి విషయంలో తన పెద్ద కొడుకుతో వచ్చిన విభేదాల కారణంగా తాను నామినేషన్ వేయాల్సి వచ్చిందని శ్యామల వివరించారు. పెద్ద కొడుకు రామారావు కోర్టును ఆశ్రయించడంతో ఇంట్లో నివాసం ఉండే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. అయితే వృద్దాప్యానికి చేరుకున్న తానిప్పుడు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నానని, కనీసం తన బాగోగులు కూడా పెద్ద కొడుకు చూడడం లేదని శ్యామల ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని దేశంలోని ప్రముఖలందరికీ వినతి పత్రాలు పంపించినా లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 82 ఏళ్ల వయసులో తనపట్ల చూపుతున్న వివక్ష సరికాదని తన గోడు సమాజానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యంతోనే జగిత్యాలలో నామినేషన్ వేశానన్నారు. తన పెద్ద కొడుకు వల్ల జరిగిన అన్యాయాన్ని సవరించి తన ఇంటిని తనకు ఇప్పించాలని కూడా కోరుతున్నారు. మరో వైపున ఆమెను బెదిరింపులకు కూడా గురిచేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు బంధువులని చెప్తూ భయపెడుతున్నారని కూడా చీటి శ్యామల తరుపు బంధువులు వివరించారు. ఆస్థి విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలన్న డిమాండ్ తో నామినేషన్ వేసినట్టు వివరించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
మహిళలకేకాదు, పురుషులకూ బస్ ఫ్రీ
లంక రైతుల టెక్ వ్యూహం.. ఇక దొంగల సీన్ సితారే !!
పాట్నా స్టేషన్లో వింత దృశ్యం..ప్లాట్‌ఫామ్ నిండా పాదముద్రలే
గ్యాస్ బండ చోరీకి ప్లాన్.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు
మానవత్వం మరిచిన సంస్థకు.. రూ.210 కోట్ల ఫైన్ వేసిన కోర్టు
రైలులో చిన్నారికి అస్వస్థత.. అప్పుడే ఓ అద్భుతం
ఆరు బ్యాంక్‌లకు కన్నం వేసిన దొంగ.. చివరికి..

