KCR: కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద భారీగా జనం.. 9 బస్సుల్లో తరలి వచ్చిన చింతమడక గ్రామస్థులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన విషయం మనకు తెలిసిందే. ఇందులో భాగంగా తన సీఎం పదవికి రాజీనామా చేసి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్లిపోయారు కేసీఆర్. ఈ క్రమంలోనే నిన్న గెలిచిన బీఆర్ఎస్ నేతలతో సమావేశం నిర్వహించారు. ఓటమికి గల కారణాలను సమీక్షించుకున్నారు. ప్రతిపక్ష పాత్రను ఎలా సమర్థవంతంగా నిర్వర్తించాలో అన్న అంశంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈరోజు కేసీఆర్ ఫాం హౌస్ కు కార్యకర్తలు పోటెత్తారు. ఏకంగా 9 బస్సుల్లో 540 మందికిపైగా కార్యకర్తలు మాజీ సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ఉత్సాహం చూపించారు. దీంతో తన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ మొత్తం బీఆర్ఎస్ కార్యకర్తలతో సందడిగా కనిపించింది. ఎన్నికల ఫలితాల అనంతరం ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటున్నారు కేసీఆర్. ఇవాళ వచ్చిన చింతమడక గ్రామస్థులకు అభివాదం చేస్తూ వారితో కొంతసేపు మాట్లాడారు. చివరగా తనపై చూపిన అభిమానానికి కృతజ్ఙతలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..