Big News Big Debate: చెల్లెమ్మ రాజకీయం.. సోనియా, రాహుల్‌తో షర్మిల చర్చలు..

|

Aug 31, 2023 | 7:12 PM

తెలుగురాష్ట్రాల రాజకీయాల్లో న్యూస్‌ మేకర్‌ ఆఫ్‌ ది వీక్‌గా మారారు వైఎస్‌ షర్మిల. తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా అడుగుపెట్టి పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌ తనయ షర్మిల కాంగ్రెస్‌ పెద్దలతో సమావేశం అయ్యారు. దీంతో విలీనంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ సాయంతోనే రాజన్న రాజ్యం సాధ్యమని షర్మిల భావించారా? YSRTP విలీనం అయితే కాంగ్రెస్‌ బలమా? బలహీనత అవుతుందా?

Big News Big Debate: చెల్లెమ్మ రాజకీయం.. సోనియా, రాహుల్‌తో షర్మిల చర్చలు..
Big News Big Debate
Follow us on

తెలుగురాష్ట్రాల రాజకీయాల్లో న్యూస్‌ మేకర్‌ ఆఫ్‌ ది వీక్‌గా మారారు వైఎస్‌ షర్మిల. తెలంగాణలో రాజన్న రాజ్యమే లక్ష్యంగా అడుగుపెట్టి పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్‌ తనయ షర్మిల కాంగ్రెస్‌ పెద్దలతో సమావేశం అయ్యారు. దీంతో విలీనంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. కాంగ్రెస్ సాయంతోనే రాజన్న రాజ్యం సాధ్యమని షర్మిల భావించారా? YSRTP విలీనం అయితే కాంగ్రెస్‌ బలమా? బలహీనత అవుతుందా?

ఢిల్లీలో సోనియా, రాహుల్‌గాంధీలతో షర్మిల చర్చలు.. విలీనం, పార్టీలో బాధ్యతలపై మొదలైన ఊహాగానాలు…

ఎన్నికలు సమీపిస్తున్నవేళ తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో వైఎస్సాఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సమావేశమయ్యారు. భర్త అనిల్‌తో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా చర్చల్లో పాల్గొన్నారు. పార్టీ విలీనంపై గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో భేటి కీలకంగా మారింది. రాజన్న బిడ్డగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ముఖ్యమని.. కేసీఆర్‌ సర్కార్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైందంటూ కీలక కామెంట్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ రాజకీయాల్లోనే ఉండాలని ఆమె బలంగా కోరుకుంటున్నారు. కానీ అధిష్టానం నుంచి ఎలాంటి భరోసా వచ్చిందన్నది తెలియదు. తెలంగాణకు మాత్రమే పరిమితం చేయకుండా తెలుగురాష్ట్రాల్లో ఆమె సేవలు అవసరమని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగా రాజ్యసభ ఇచ్చి తెలుగురాష్ట్రాల్లో ఆమె చేత ప్రచారం చేయించాలన్నది వ్యూహం. అయితే షర్మిల పార్టీ విలీనం ఒకే అయినా.. తెలంగాణలో ఆమె పోటీచేయాలన్న ఆలోచనను రేవంత్‌ వర్గం వ్యతిరేకిస్తోంది. పార్టీలో విలీనం అయినా ఏపీకి పరిమితం చేయాలని కోరుతున్నారు. అయితే కోమటిరెడ్డి వంటి సీనియర్లు మాత్రం వైఎస్‌ అభిమానులు తెలంగాణలో ఉన్నారని.. ఎన్నికల్లో కలిసివస్తాయంటున్నారు. అటు షర్మిలపై బీఆర్ఎస్‌ మాటలదాడి మొదలుపెట్టింది. షర్మిల రాక అంటే ఆంధ్రా పెత్తనమే అని ఆ పార్టీ అభిప్రాయపడుతోంది.

మొత్తానికి షర్మిల మనసులో ఏముంది? విలీనంపై ఆమె పెట్టిన షరతులు ఏంటి? ప్రస్తుతం బయట జరుగుతున్నదంతా ప్రచారమే..మరి నిజాలేంటో?

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..