Big News Big Debate: చరిత్ర సృష్టించిన రిషి సునక్.. అక్కడ పట్టం.. ఇక్కడ నష్టం.! ప్రపంచాన్ని ఏలుతున్న ఇండియన్స్..
ఇండియన్స్ ప్రపంచాన్ని ఏలుతున్నారని ఆనందపడాలా? మనదేశం నుంచి మేథావులు వెళ్లిపోతున్నారని బాధపడాలా.? ప్రజాధనంతో ఇక్కడ నిపుణులను తయారుచేసి విదేశాలకు అప్పగిస్తున్నామా.?
కేవలం 42 ఏళ్ల వయసులోనే సూర్యాస్తమయం ఎరుగని ఒకప్పటి సామ్రాజ్యం.. ఇప్పుడు బ్రిటన్‌కు ప్రధానిగా ఎన్నికయ్యారు రుషి. 200 ఏళ్ల దేశ చరిత్రలో ఇంత చిన్నవయసులో ఎవరూ ఆ పదవిని చేపట్టలేదు. 2015లో మాత్రమే దేశ రాజకీయాల్లోకి వచ్చిన రిషి సునాక్.. తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించారు. చీఫ్ ట్రెజరీ సెక్రటరీగా గుర్తింపు పొందారు. దీంతో ఆయనకు బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా అవకాశం దక్కింది. మంత్రిగా తనదైన ముద్ర వేసిన రుషి సునాక్ ఇటీవల ప్రధాని పదవి రేసులో నిలబడ్డారు. టోరీల మద్దతు కూడగట్టడంలో విఫలమైన ఆయనకు స్వల్ప తేడాతో పదవి చేజారింది. లిజ్ ట్రస్ బాధ్యతలు తీసుకున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం కావడంతో పాటు.. ఆర్థికంగా పరిస్థితులను చక్కదిద్దడంలో ఆమె ఫెయిల్ అయ్యారు. దీంతో పదవికి రాజీనామా చేశారు. సరిగ్గా ఇదే సమయంలో సంక్షోభం నుంచి గట్టెక్కిస్తానంటూ ముందుకొచ్చారు రిషి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.