Big News Big Debate: NDA vs I.N.D.I.A.. 2024లో ద్విముఖ పోటీయేనా?
భారతదేశ రాజకీయాల్లో సరికొత్త సంచలనం విపక్ష కూటమి. మోదీ సారధ్యంలో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్న NDA ఓడించేందుకు విపక్షాలన్నీ ఒక్కటవుతున్నాయి. కాంగ్రెస్, లెఫ్ట్ సహా 26 పార్టీలు సొంత సిద్ధాంతాలు, విధానాలు పక్కనపెట్టి సింగిల్ పాయింట్ అజెండాతో ఏకమయ్యాయి. NDAకు పోటీగా బెంగళూరు వేదికగా INDIA పేరుతో కూటమి ప్రకటించాయి. ఇంతకాలం ఉనికిలో ఉన్న యూపీఏ ఇక మీదట ఇండియాగా మారుతుంది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయేతో తలపడేందుకు సై అంటున్నారు కూటమి నేతలు.
పాట్నాలో విపక్షాల మీటింగ్ తర్వాత అలర్ట్ అయితే బీజేపీ కూడా ఎన్డీయే బలోపేతంపై ఫోకస్ పెట్టింది. పాత మిత్రులతో పాటు కొత్త స్నేహితులను కలుపుకుని మరీ ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీలో 38 పార్టీలతో NDA సమావేశం ఏర్పాటు చేసింది. మొత్తానికి 2024 సార్వత్రిక ఎన్నికలకు రెండు కూటముల మధ్య ఫైట్ ఖరారు అయింది. బీజేపీ సారధ్యంలో ఎన్డీయేకు, కాంగ్రెస్ సారధ్యంలోని INDIA కూటమికి మధ్య వార్ ఫిక్స్ అయింది. మరి ఇందులో ఎవరి బలం ఏంత? ఎన్డీయే ఢీకోట్టే బలం విపక్ష కూటమికి ఉందా?
Published on: Jul 18, 2023 07:01 PM
వైరల్ వీడియోలు
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

