Big News Big Debate: వన్‌ నేషన్‌- వన్‌ ఎలక్షన్‌.. సాధ్యమేనా.. పొలిటికల్‌ డైవర్షనా..? పార్లమెంట్‌ సమావేశాలపై ఉత్కంఠ

|

Aug 31, 2023 | 7:28 PM

One Nation, One Election: వన్‌ నేషన్‌ - వన్‌ ఎలక్షన్ మళ్లీ తెరమీదకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహించేలా బిల్లు తీసుకొచ్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా సెప్టెంబర్‌ నెలలో నిర్వహిస్తున్న పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెడతారని తెలుస్తోంది. చాలాకాలంగా దీనిపై చర్చ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పలు సందర్భాల్లో జమిలీ ఎన్నికలను ప్రస్తావించారు.

Big News Big Debate: వన్‌ నేషన్‌- వన్‌ ఎలక్షన్‌.. సాధ్యమేనా.. పొలిటికల్‌ డైవర్షనా..? పార్లమెంట్‌ సమావేశాలపై ఉత్కంఠ
7.30pm Big News Big Debate 31 08 2023 Live
Follow us on

One Nation, One Election: వన్‌ నేషన్‌ – వన్‌ ఎలక్షన్ మళ్లీ తెరమీదకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహించేలా బిల్లు తీసుకొచ్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా సెప్టెంబర్‌ నెలలో నిర్వహిస్తున్న పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెడతారని తెలుస్తోంది. చాలాకాలంగా దీనిపై చర్చ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పలు సందర్భాల్లో జమిలీ ఎన్నికలను ప్రస్తావించారు. రాష్ట్రపతి ప్రసంగంలో కూడా పెట్టారు. అయితే ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సెషన్‌లో మాత్రం సాధ్యం కాదంటూ రాజ్యసభలో మంత్రి ప్రకటన విడుదల చేశారు. అయితే ప్రతిష్టాత్మకంగా భావించే బిల్లులను అనూహ్యంగా తెరమీదకు తీసుకురావడంతో బీజేపీ ముందుంటుంది… ఇప్పుడు కూడా అదే మాజిక్‌ జరగొచ్చని అంటారు నిపుణులు. ‌

వచ్చే నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఐదురోజుల పాటు పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతాయి. అమృత్‌కాల్‌ సందర్భంగా ఈ సమావేశాలు నిర్వహిస్తునట్టు కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి వెల్లడించారు. అయితే ఆకస్మాత్తుగా కేంద్రం ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలను ఏర్పాటు చేయడంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సడెన్‌గా సమావేశాలను ఏర్పాటు చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెడుతారని ప్రచారం జరుగుతోంది.

కామన్‌ సివిల్‌ కోడ్‌ బిల్లు ఉంటుందా ? లేక జనాకర్షణ బిల్లులు ఆమోదిస్తారా ? ఈవిషయంపై సస్పెన్స్‌ నెలకొది.. ఇప్పటికే వంటగ్యాస్‌ ధరలను తగ్గించింది కేంద్రం.. దీంతో మరిన్ని ప్రజాకర్ణణ బిల్లులు ప్రవేశపెడుతారని,అందుకే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. పాత పార్లమెంట్‌ భవనం లోనే ఈ ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..