Telangana: తుమ్మలతో రేవంత్ రెడ్డి భేటీ.. త్వరలో కాంగ్రెస్ గూటికి..!
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీనియర్‌నేత మల్లు రవి భేటీ అయ్యారు. తుమ్మలను కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారు. రేవంత్ విజ్ఞప్తిపై తుమ్మల సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. పాలేరు అసెంబ్లీ టికెట్ దక్కక పోవటంతో తుమ్మల నాగేశ్వరరావు కొద్దిరోజులుగా బీఆర్‌ఎస్‌కు దూరంగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం అనుచరులతో ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తుమ్మల నాగేశ్వరరావు.. కాంగ్రెస్‌లోకి వస్తే పాలేరు టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ వర్గాలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఆయన పెద్దగా మాట్లాడరు. ఎలాంటి సమస్య వచ్చినా మౌనంగానే డీల్ చేస్తారు.. మొన్న కేసీఆర్ ప్రకటించిన ఫస్ట్ లిస్ట్‌లో ఆయన పేరు లేదు. రెండో లిస్టులో రాదు..దీంతో..ఆయన అనుచరులు పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నా.. ఆయన మాత్రం చిరునవ్వుతో మౌనరాగం ఆలపిస్తున్నారు. చివరకు ప్రజలకోసం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. ఇదే ఆయన బ్యాచ్‌కు బూస్ట్ లాంటిది.. అయినా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా.. కమలం గూటిలోకి వెళ్తారా.. హస్తం పంచన నిలబడతారా.. ఇంతకీ తుమ్మల నాగేశ్వరరావు దారెటు.. అన్నది రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ సస్పెన్స్ కొనసాగుతుండగానే.. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి సహా.. ఇతర నేతలు వెళ్లి.. ఆయన్ను పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు.
Published on: Aug 31, 2023 09:43 PM
వైరల్ వీడియోలు
Latest Videos