పథకం అంటే ఇదీ.. పాతిక లక్షల వరకు ఫ్రీ వైద్యం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. NTR వైద్య సేవ యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోద తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని పేదలకు రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించే సరికొత్త ఆరోగ్య విధానం రూపకల్పనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
ఇందుకు సంబంధించి బీమా కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించేందుకు వీలుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదనకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన – ఎన్టీఆర్ వైద్య సేవ కింద హైబ్రిడ్ విధానంలో కొత్త ఆరోగ్య విధానం రూపొందిస్తారు. రాష్ట్రంలోని 5 కోట్లమందికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రూ.25 లక్షల వరకు ఎన్టీఆర్ ఆరోగ్య సేవా ట్రస్టు ద్వారా వైద్య సేవలు అందిస్తారు. దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న వారికి రూ.2.5 లక్షల వరకు వైద్య బీమా వర్తిస్తుంది. వర్కింగ్ జర్నలిస్టులను కూడా ఈ పథకంలోకి తీసుకువస్తారు. ఉద్యోగుల వైద్య పథకం పరిధిలోకి వచ్చే వారికి తప్ప మిగిలిన అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. రూ.2.5 లక్షల బీమా సొమ్ము మినహా మిగిలింది బీమా కంపెనీయే తొలుత చెల్లిస్తుంది. దానిని తర్వాత ప్రభుత్వం రీయింబర్సు చేస్తుంది. ఈ బీమా కింద మొత్తం 3,257 రకాల వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ పథకం కింద జబ్బుపడిన వారు ఆసుపత్రిలో చేరిన ఆరు గంటల్లోపు ఉచిత వైద్యానికి అనుమతి ఇస్తారు. 15 రోజుల్లోగా ఆసుపత్రులకు బిల్లులు చెల్లిస్తారు. ప్రతి పేషెంట్‌కు క్యూఆర్ కోడ్ ఇచ్చి అమలు తీరుపై పర్యవేక్షిస్తారు. ఇందుకు ఎన్టీఆర్ ఆరోగ్య సేవా ట్రస్టు ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేస్తారు. ఏవైనా అక్రమాలు జరిగితే కేంద్ర ప్రభుత్వ యాంటీ ఫ్రాడ్ ప్రోగ్రాం కింద చర్యలు తీసుకుంటారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారత్‌నే బెదిరిస్తావా.. ట్రంప్ ?? పుతిన్
Ganesh Nimajjanam 2025: గణేష్ నిమజ్జన శోభాయాత్రలో అఘోరాలు.. గొరిల్లా..
Yadagirigutta: యాదగిరి నరసన్నకు భక్తుడి భారీ విరాళం
చిమ్మ చీకటి.. జోరువాన.. సెల్ లైట్ వెలుగులో డెలివరీ
రూ. 8 కోట్ల లగ్జరీ నౌక.. ప్రారంభించిన నిమిషాల్లోనే సముద్రంలో మునక
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

