Amit Shah: ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్‌కు చీఫ్ గెస్ట్‌గా అమిత్ షా.. లైవ్ వీడియో
నేషనల్ పోలీస్ అకాడమీలో 75వ బ్యాచ్ ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్ జరుగుతుంది..ఇక.. పాసింగ్ అవుట్ పరేడ్ చీఫ్ గెస్ట్‌గా హాజరైయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. 175 మంది ట్రైనీ ఐపీఎస్‌లు శిక్షణ పూర్తిచేసుకున్నారు. అందులో 155 ఇండియన్ ఆఫీసర్స్, 20 ఫారెన్ ఆఫీసర్స్ ఉన్నారు. 34 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు. మొత్తం ట్రైనింగ్‌లో ఇండోర్.. ఔట్ డోర్.. ఫిజికల్‌కు సంబంధించి.. 102 వారాల పాటు కఠోర శిక్షణ పూర్తిచేశారు. ఫిజికల్ ఫిట్నెస్‌తోపాటు.. చట్టాలపై పట్టు కోసం ప్రత్యేక శిక్షణ పొందారు.
Published on: Oct 27, 2023 08:14 AM
వైరల్ వీడియోలు
Latest Videos