Watch Video: రైతుబంధుపై ఈసీకి ఫిర్యాదు దారుణం.. కాంగ్రెస్‌పై మంత్రి హరీశ్ మండిపాటు
రైతులకు ప్రభుత్వ సాయాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు కాంగ్రెస్‌కు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులు కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు చేస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ తీరు చూస్తుంటే కేసీఆర్‌కు పేరు వస్తుందని అన్ని ఆపేయమని చెప్తున్నట్టుగా ఉందని అభ్యంతరం వ్యక్తంచేశారు.
రైతుబంధు నిలిపేయాలని కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుబంధు పథకం కొత్త పథకం కాదని.. ఇప్పటి వరకు 11సార్లు రైతుబంధు సాయం అందించామన్నారు. 12వసారి రైతుబంధు ఇవ్వబోతుంటే ఇప్పుడు ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందన్నారు. రైతులకు ప్రభుత్వ సాయాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులు కాంగ్రెస్‌కు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులు కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు చేస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ తీరు చూస్తుంటే కేసీఆర్‌కు పేరు వస్తుందని అన్ని ఆపేయమని చెప్తున్నట్టుగా ఉందని అభ్యంతరం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు తమ పరిస్థితి అయిందని కర్నాటక రైతులు అంటున్నారని చెప్పారు. కర్నాటకలో 5 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారని ఆరోపించారు.