ఆపరేషన్ సింధూర్‌పై లోక్‌సభలో రెండోరోజు చర్చ.. అమిత్ షా కీలక ప్రకటన.. లైవ్ వీడియో..
ఆపరేషన్ సింధూర్‌పై లోక్‌సభలో రెండోరోజు చర్చ కొనసాగుతోంది. మంగళవారం లోక్‌సభలో అమిత్‌షా ప్రసంగం చేస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. కాగా.. లోక్ సభతోపాటు.. రాజ్యసభలోనూ ఇవాళ ఆపరేషన్ సింధూర్‌పై చర్చ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే మాట్లాడనున్నారు.
ఆపరేషన్ సింధూర్‌పై లోక్‌సభలో రెండోరోజు చర్చ కొనసాగుతోంది. మంగళవారం లోక్‌సభలో అమిత్‌షా ప్రసంగం చేస్తున్నారు. సాయంత్రం 7 గంటలకు లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. కాగా.. లోక్ సభతోపాటు.. రాజ్యసభలోనూ ఇవాళ ఆపరేషన్ సింధూర్‌పై చర్చ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే మాట్లాడనున్నారు. కాగా.. ఆపరేషన్ సింధూర్‌పై చర్చ కోసం లోక్‌సభలో 16 గంటల సమయం కేటాయించారు. నిన్న చర్చను ప్రారంభించారు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్. ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలించడానికి ఎంత దూరమైనా వెళతామని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. ఆశించిన ‘రాజకీయ, సైనిక లక్ష్యాల’ను చేరుకున్నందు వల్లనే ‘ఆపరేషన్ సిందూర్’కు విరామం ఇచ్చామని, ఈ విషయంలో మనపై ఎలాంటి ఒత్తిడి లేదని రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ మరోసారి దుస్సాహసానికి ఒడిగడితే ఈ ఆపరేషన్‌ను పునరుద్ధరిస్తామని హెచ్చరించారు. ఏప్రిల్ 22 నుంచి జూన్ 17 వరకు ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ల మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. వాణిజ్యంతో ఈ ఆపరేషన్‌ను అమెరికా ఏ దశలోనూ ముడిపెట్టలేదని తేల్చిచెప్పారు.
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

