Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరకులోయలో పారా గ్లైడింగ్.. ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

అరకులోయలో పారా గ్లైడింగ్.. ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

Phani CH

|

Updated on: Oct 01, 2024 | 9:42 PM

ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. అల్లూరి జిల్లాలోని అరకులోయ పరిసర ప్రాంతాలలో పర్యాటక రంగం అభివృద్దికి జెట్‌ స్పీడ్‌తో కార్యాచరణ మొదలు పెట్టింది. అరకులోయలో పారా గ్లైడింగ్ ఇంట్రడ్యూస్‌ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం అనువైన ప్రాంతాల పరిశీలించింది. ఈమేరకు ఐటీడీఏ పీవో అభిషేక్ క్షేత్రస్థాయిలో పర్యటించారు.

ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు ఏపీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుంది. అల్లూరి జిల్లాలోని అరకులోయ పరిసర ప్రాంతాలలో పర్యాటక రంగం అభివృద్దికి జెట్‌ స్పీడ్‌తో కార్యాచరణ మొదలు పెట్టింది. అరకులోయలో పారా గ్లైడింగ్ ఇంట్రడ్యూస్‌ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం అనువైన ప్రాంతాల పరిశీలించింది. ఈమేరకు ఐటీడీఏ పీవో అభిషేక్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. గాలి వాటం, ఫ్లయింగ్, లాండింగ్ కు అనువైన ప్రాంతాలుగా మాడగడ వ్యూ పాయింట్, జైపూర్ జంక్షన్ ఎంపిక చేశారు. విజయవంతంగా ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. స్వయంగా గ్లైడింగ్ చేశారు పాడేరు ఐటిడిఎ పిఓ అభిషేక్. త్వరలోనే ఇక్కడ పారా గ్లైడింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. తద్వారా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పెరుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే విశాఖ నగరం పోర్ట్ నగరంగా, సౌత్‌ ఇండియా టూరిస్ట్‌ ప్లేస్‌గా ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. ఇక్కడి పర్యాటక ప్రాంతాలు టూరిస్టులను ఆకర్షిస్తూ ఉంటాయి. పొడవైన సాగరతీరం, ఆకట్టుకునే బీచ్ లు, ఉద్యానవనాలు, పచ్చని కొండలు, వారసత్వ కట్టడాలు, అభయారణ్యాలు వంటి ఎన్నో ప్రత్యేకతలతో వైజాగ్ నగరం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతోంది. ఈ క్రమంలో పారా మోటరింగ్ గ్లైడింగ్ రాకతో పర్యాటకుల తాకిడి మరింతగా పెరగనుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోనసీమ కొబ్బరికి మహర్దశ.. ఒక్క నెలలో ధర ఎంత పెరిగిందంటే ??

బెలూన్లలో చెత్త నింపి వదులుతున్న ఉత్తరకొరియా.. భయంతో కేకలు వేసిన పిల్లలు

గార్డెన్‌లోకి దూసుకొచ్చిన పాము.. పరుగెత్తుకొచ్చిన శునకం.. ఏం చేసిందంటే ??

చనువిచ్చిందికదా అని చొరవ తీసుకున్నాడు.. చివరికి..