విమాన ప్రయాణాలపై ఎపెక్ట్ ?? తప్పదంటున్న శాస్తవేత్తలు

ప్రపంచవ్యాప్తంగా విమానంలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. పెరుగుతున్న విమాన ప్రయాణాలు వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయట. పరిశోధనలను ఉటంకిస్తూ కేంబ్రిడ్జి యూనివర్శిటీ తాజా అధ్యయనంలో తెలిపింది. విమాన వేగాన్ని 15 శాతం తగ్గించాలని పరిశోధనకారులు అన్నట్లు తెలిపింది.

విమాన ప్రయాణాలపై ఎపెక్ట్ ?? తప్పదంటున్న శాస్తవేత్తలు

|

Updated on: Oct 01, 2024 | 9:43 PM

ప్రపంచవ్యాప్తంగా విమానంలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. పెరుగుతున్న విమాన ప్రయాణాలు వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయట. పరిశోధనలను ఉటంకిస్తూ కేంబ్రిడ్జి యూనివర్శిటీ తాజా అధ్యయనంలో తెలిపింది. విమాన వేగాన్ని 15 శాతం తగ్గించాలని పరిశోధనకారులు అన్నట్లు తెలిపింది. దీనివల్ల ఇంధన వినియోగాన్ని 5 నుంచి 7 శాతం వరకు తగ్గించడంతో పాటు హరిత విమానయాన పరిశ్రమకు దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు. కేంబ్రిడ్జి యూనివర్శిటీ ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో కేవలం 10 శాతం మంది మాత్రమే విమాన ప్రయాణాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రజల ఆదాయాలు పెరిగేకొద్దీ ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. విమానాల సంఖ్య పెరిగితే వాటి వల్ల వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాల శాతం పెరుగుతోంది. 2025 లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని విమానయాన రంగంలో పలు కీలక మార్పులు చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అందులోభాగంగా విమాన వేగాన్ని 15 శాతం తగ్గించడం ద్వారా కొంత మేర కర్బన ఉద్గారాల శాతాన్ని తగ్గించవచ్చని భావిస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అరకులోయలో పారా గ్లైడింగ్.. ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

కోనసీమ కొబ్బరికి మహర్దశ.. ఒక్క నెలలో ధర ఎంత పెరిగిందంటే ??

బెలూన్లలో చెత్త నింపి వదులుతున్న ఉత్తరకొరియా.. భయంతో కేకలు వేసిన పిల్లలు

గార్డెన్‌లోకి దూసుకొచ్చిన పాము.. పరుగెత్తుకొచ్చిన శునకం.. ఏం చేసిందంటే ??

చనువిచ్చిందికదా అని చొరవ తీసుకున్నాడు.. చివరికి..

Follow us