ఈ వారం ఓటీటీల్లో 14 సినిమాలు.. ఆ మూవీని మాత్రం డోంట్ మిస్!
ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు వినోదాల విందు సిద్ధమైంది. దాదాపు 14 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్‌కు రానున్నాయి. ముఖ్యంగా దృశ్యం 3, సేవ్ ది టైగర్స్ సీజన్ 3 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, లయన్స్‌గేట్ ప్లే వేదికలపై తెలుగు, హిందీ, హాలీవుడ్, కొరియన్ కంటెంట్ సందడి చేయనుంది.
ఓ పక్క పెద్ది ప్రభంజనం థియేటర్లలో కంటిన్యూ అవుతుండగానే… మరో పక్క ఓటీటీలో కూడా కొన్ని సినిమాలు స్ట్రీమ్ అయ్యేందుకు రెడీ అయిపోయాయి. ఈ వారం దాదాపు 14 సినిమాలు ఓటీటీల్లో సందడి చేసేందుకు అవస్తున్నాయి. వాటిలో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు, సిరీస్‌లు ఉన్నాయి. అయితే వాటిలో దృశ్యం3, సేవ్ ది టైగర్ సీజన్ 3 పై మాత్రం అందర్లో విపరీతమైన వెయిటింగ్ ఉంది.
నెట్‌ఫ్లిక్స్‌లో విషయానికి వస్తే..
మై అమెరికాస్ స్వీట్‌హార్ట్స్ సీజన్ 3 అనే వెబ్‌సిరీస్ జూన్ 16 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. డ్రింకింగ్ బడ్డీస్ అనే హాలీవుడ్ మూవీ జూన్ 15 నుంచి ఐ విల్ ఫైండ్ యూ అనే హాలీవుడ్ సిరీస్ జూన్ 18 నుంచి, వాయిస్‌మెయిల్స్ ఫర్ ఇసబెల్లె అనే హాలీవుడ్ సినిమా – జూన్ 19 నుంచి, తుక్రా కె మేరా ప్యార్ సీజన్-2 వెబ్ సిరీస్ – జూన్ 19 నుంచి, హస్బెండ్స్ ఇన్ యాక్షన్ అనే కొరియన్ మూవీ- జూన్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఇక జియో హాట్ స్టార్ విషయానికి వస్తే…
కెనతా కానోమ్ అనే తమిళ సినిమా- జూన్ 16 నుంచి, సేవ్ ది టైగర్స్ 3 – తెలుగు వెబ్‌సిరీస్ జూన్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఇక అమెజాన్ ప్రైమ్‌లో…
యువర్ ఫాల్ట్ అనే హాలీవుడ్ మూవీ- జూన్ 17 నుంచి, ది మోస్ట్ అవేటెడ్ దృశ్యం-3 జూన్ 18 నుంచి, ది ఎజెన్సీ- సీజన్-2 – ఇంగ్లీష్ వెబ్ సిరీస్ జూన్ 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
లయన్స్ గేట్ ప్లే లో…
అలియా బసు గాయబ్ హై అనే బాలీవుడ్ మూవీ – జూన్ 19 నుంచి, M4M – మోటివ్ ఫర్ మర్డర్ అనే తెలుగు సినిమా – జూన్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఇక సోనీ లివ్ విషయానికి వస్తే..
అతిరథి అనే మలయాళ సినిమా- జూన్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
జూన్ ఫ్రైడే రోజు కూడా పలు భాషలకు చెందిన దాదాపు 21 సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చాయి. అందులో సౌత్ లో సూపర్ డూపర్ హిట్టైన సూర్య కరుప్పుతో పాటే.. బాలీవుడ్ భూత్ బంగ్లా లాంటి సినిమా కూడా ఉంది. అంతేకాకుండా బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ నుంచి సినిమాలతో పాటు పలు ఆసక్తికర వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మన హీరోలకు బేసిక్ సినిమా నాలెడ్జ్ లేదు
సినిమాల తర్వాత ప్రజాసేవే లక్ష్యం.. రాజకీయాల్లోకి మరో తమిళ స్టార్
ప్రేమ చేసిన హత్య? పాపం! సంచిత!
బిగ్ బాస్ 10 ఫస్ట్ కంటెస్టెంట్‌గా.. సీరియల్ బ్యూటీ ఫిక్స్?
వర్క్ ఫ్రమ్ బైక్.. అంత ఆత్రం ఎందుకు బాబూ.. బ్రతకాలని లేదా నీకు!
వర్క్ ఫ్రమ్ బైక్.. అంత ఆత్రం ఎందుకు బాబూ..బ్రతకాలని లేదా నీకు!
అస్థిపంజరాలు చెప్పిన లక్షల ఏళ్ల నాటి రహస్యం..
92 ఏళ్ల వయసులో 30 ఏళ్ల ఫిట్నెస్..!
అక్కడ కొండచిలువల వేట చాలా ఫేమస్!
12 రోజుల పాటు కదలని ట్రాఫిక్ జామ్.. ఎక్కడ? ఎప్పుడు?
క్లీనర్, కార్ వాషర్గా చిన్న పనులు చేసి.. కోట్లు సంపాదించాడు
కాంబ్లీ నుంచి కోహ్లీ వరకు.. ముంబై టాప్ ఏరియాల్లో ఖరీదైన ఇళ్లు!

