ఆస్కార్‌కు ఇండియా నుంచి ఒకే ఒక్కటి
ఆస్కార్ అవార్డులపై భారతదేశంలో మళ్ళీ క్రేజ్ పెరిగింది. 'ట్రిపుల్ ఆర్' స్ఫూర్తితో, 2026 ఆస్కార్ రేసులో ఇండియన్ సినిమా 'హోమ్ బౌండ్' షార్ట్‌లిస్ట్ అయ్యింది. 98వ అకాడమీ అవార్డుల "ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్" కేటగిరీలో ఈ చిత్రం పోటీపడుతోంది. జనవరి 22, 2026న నామినేషన్లు, మార్చి 15న అవార్డుల ప్రదానోత్సవం జరగనున్నాయి.
ఆస్కార్ అవార్డుల సందడి మళ్లీ మొదలైంది. ఒకప్పుడు మనకు సంబంధం లేనట్లుగానే ఉన్న ఈ అవార్డులను ట్రిపుల్ ఆర్ సినిమా ఇండియాకు బాగా చేరువ చేసింది. మనకు కూడా ఆస్కార్ వస్తుందనే నమ్మకం మేకర్స్‌లో కలిగించింది. మరి 2026 ఆస్కార్ రేసులో ఉన్న ఇండియన్ సినిమాలేంటి..? తెలుగు నుంచి ఏదైనా రేసులో ఉందా..? రెండేళ్ళ కింద ట్రిపుల్ ఆర్ పుణ్యమా అని ఆస్కార్ అవార్డులపై ఇండియాలో కూడా క్రేజ్ పెరిగింది. అప్పటి వరకు హాలీవుడ్‌కు మాత్రమే ఆస్కార్ వస్తుందని నమ్మిన వాళ్లకు.. మనం కూడా రేసులో ఉన్నామని గుర్తు చేసిన సినిమా ట్రిపుల్ ఆర్. గతేడాది ఆస్కార్‌లో మనకు నిరాశే ఎదురైనా.. 2026 రేసులో మాత్రం ఓ ఇండియన్ సినిమా ముందడుగేసింది. ఇండియా నుంచి హోమ్ బౌండ్ ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అయింది. నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రతిష్ఠాత్మక 98వ అకాడమీ అవార్డుల రేసులో నిలిచింది. ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఈ సినిమాను షార్ట్‌లిస్ట్ చేసినట్లు అకాడమీ ప్రకటించింది. కరణ్ జోహార్ సైతం ఇది పోస్ట్ చేసారు. 98వ అకాడమీ అవార్డుల కోసం మొత్తం 12 విభాగాల్లో ఎంపికైన చిత్రాల జాబితాను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ విడుదల చేసింది. ఆస్కార్ తుది నామినేషన్లను 2026 జనవరి 22న ప్రకటించనుండగా.. మార్చి 15న అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. కాగా సంక్రాంతికి వస్తున్నాం, కుబేరా, పుష్ప 2, గాంధీతాత చెట్టు, కన్నప్ప లాంటి సినిమాలు ఆస్కార్ కోసం పోటీ పడి రేసు నుంచి తప్పుకున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
The Raja Saab: ఫ్యాన్స్ కోసం తప్పట్లేదంటున్న ప్రభాస్
మీడియం రేంజ్ హీరోలు కూడా ఇలా చేస్తే ఎలా..?
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

