Watch: బాసరలో ఉగ్ర గోదావరి.. శాంతించాలని అర్చకులు ప్రత్యేక పూజలు
నిర్మల్ జిల్లా బాసరలో గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. వరదల కారణంగా ఆలయం దగ్గర పుష్కర ఘాట్లు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో గోదావరి శాంతించాలని బాసర ప్రధాన ఆలయం వద్ద అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. కాగా బాసరలో చిక్కుకున్న పలువురిని రిస్క్యూ టీమ్స్ పునరావాస కేంద్రాలకు తరలించాయి.
నిర్మల్ జిల్లా బాసరలో గోదావరికి వరద పోటెత్తింది. బాసర పురవీధుల్లోకి గోదావరి బ్యాక్ వాటర్ రావడంతో పుష్కర ఘాట్లు పూర్తిగా నీట మునిగాయి. బాసర ఆలయం దగ్గర 50కి పైగా దుకాణాలు నీటమునిగాయి. మరోవైపు బాసర ప్రధాన ఆలయం దగ్గర గోదావరి శాంతించాలని అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
నిర్మల్ జిల్లా బాసరలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అమ్మవారి ఆలయ సమీపంలోని ఆర్యవైశ్య సత్రంలో చిక్కుకున్న గర్భిణీతో పాటు వరద నీటిలో చిక్కుకున్న 36 మంది విద్యార్థులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇళ్లల్లో చిక్కుకున్న 150 మందిని కూడా తరలించారు.
వైరల్ వీడియోలు
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

