AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది పిచ్చి మొక్క కాదు.. క్యాన్సర్‌ను అరికట్టే దివ్యౌషధం

ఇది పిచ్చి మొక్క కాదు.. క్యాన్సర్‌ను అరికట్టే దివ్యౌషధం

Phani CH
| Edited By: |

Updated on: Nov 24, 2025 | 5:49 PM

Share

కొత్త మూలికలు క్యాన్సర్, గాయాల చికిత్సలో ఆశలు రేపుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాల్లో కనుగొనబడిన మూడు ఆకుల మొక్క (పులిచింత ఆకు) క్యాన్సర్‌ను అరికట్టగలదని పరిశోధనల్లో తేలింది. ట్రైడాక్స్ ప్రొకంబెన్స్ గాయాలను త్వరగా మాన్పుతుంది. ఈ పరిశోధనలు మానవాళికి కొత్త చికిత్సా మార్గాలను చూపగలవు.

క్యాన్సర్‌ మహమ్మారిని పూర్తిగా తగ్గించే మందులు లేకపోవడం దురదృష్టకరం. ఇప్పటికీ ఈ క్యాన్సర్‌ బారిన పడి అనేకమంది మృత్యువాత పడుతున్నారు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌, కాలేయం ఇలా రకరకాల రూపాల్లో మానవాళిపై ఎటాక్‌ చేస్తుంది క్యాన్సర్‌. మొదటి దశలో గుర్తిస్తే కొన్ని రకాల క్యాన్సర్స్‌ నుంచి చికిత్స ద్వారా కోలుకుంటున్నారు. తాజాగా పరిశోధకులు కొత్త మూలికను కనిపెట్టారు. క్యాన్సర్‌ను అరికట్టడంలో ఈ మూలిక చాలా బాగా పని చేస్తుందని పరిశోధనల్లో తేలింది. ఎక్కడపడితే అక్కడ మొలిచే ఈ మొక్కలో ఇన్ని ఔషధ గుణాలున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. మధ్యప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాల్లో లభ్యమయ్యే పలు మూలికలపై పండిత్‌ ఖుషిలాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ జరిపిన పరిశోధనల్లో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. బాలాఘాట్, అనుప్పుర్, దిన్‌దోరి, శహడోల్‌లో స్థానిక గిరిజనులు సంప్రదాయంగా ఉపయోగించే మూలికల పై అధ్యయనాన్ని ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ల బృందం చేపట్టింది. ఈ సందర్భంగా ప్లాంటాజినాసియా కుటుంబానికి చెందిన ఓ మూడు ఆకుల మొక్కలోని ఆకులు, కాండం.. క్యాన్సర్‌ నిరోధక లక్షణాలను కలిగి ఉన్నాయని తేలింది. పరిశోధకులు ఎలుకలపై చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. దీనిని తెలుగు రాష్ట్రాల్లో పులిచింత ఆకుగా వ్యవహరిస్తారు. ఈ ఫలితాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయని, దీని ప్రయోజనాలు విస్తృతంగా పొందేందుకు ఇతర ప్రాంతాల్లోనూ ఆ మూలిక సాగును చేపట్టాలని వైద్య బృందం సూచించింది. ఘమ్రాలో మరో మూలికను గుర్తించారు పరిశోధకులు. ఇది గాయాలను త్వరగా మాన్పడంలో బాగా పని చేస్తుందని తెలిపారు. ట్రైడాక్స్‌ ప్రొకంబెన్స్‌గా వ్యవహరించే ఈ మొక్క జంతువుల శరీరాల్లో అత్యంత నాణ్యమైన కణజాలాన్ని కూడా ఏర్పరుస్తోందని, ప్రస్తుతం మానవుల్లో దీని పనితీరు పై అధ్యయనం కొనసాగుతోందని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

10 దేశాల మీదుగా.. 300 ఉప నదులను కలుపుకుంటూ

ఈ సమస్యలు ఉంటే బాదం జోలికి అస్సలు వెళ్లొద్దు

ఎలా వస్తాయ్‌రా ఇలాంటి ఐడియాలు

పేర్చిన వస్తువులు టకటకా పడిపోతున్నాయ్..! తొంగి చూస్తే హడల్

Published on: Nov 24, 2025 03:51 PM