AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మునిగిన ముంబై.. ఆర్థిక రాజధాని అతలాకుతలం

మునిగిన ముంబై.. ఆర్థిక రాజధాని అతలాకుతలం

Phani CH
| Edited By: TV9 Telugu|

Updated on: Aug 21, 2025 | 12:20 PM

Share

ముంబై మునిగింది.. నగరాన్ని కుండపోత వాన తడిపి ముద్ద చేసింది. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ముంబైలోని పొవాయ్‌ సమీపంలో ఓ వ్యక్తి వరదల్లో కొట్టుకుపోయాడు. మీఠీ నది ప్రవాహంలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. తాడు వేసి అతన్ని పైకి లాగే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వరద ఉధృతికి ఆ వ్యక్తి కొట్టుకుపోయాడు.

ఎటు చూసినా మోకాలి లోతు నీళ్లు. భారీ వర్షాలు ముంబైని ముంచెత్తాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు మునిగిపోయాయి. అయినా వాటిల్లో నుంచే వాహనదారులు వాహనాలు నడపాల్సి వచ్చింది. ఇదిలావుంటే ఆగస్టు 20 వరకు నగరంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించడం ప్రజలను మరింత భయపెడుతోంది. ఇక నవీ ముంబైలో కూడా రోడ్లు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరుకుంది. ఆయా ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ముంబై అంబేడ్కర్​ మార్గ్​, లేడీ జహంగీర్​ రోడ్​ వద్ద ఇదే పరిస్థితి. మోకాలి లోతు నీరు పేరుకుపోవడంతో ప్రజలు నడవడానికి సైతం ఇబ్బంది పడ్డారు. వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారు.. ముంబైలో జరిగిన వేర్వేరు విషాద ఘటనలు తీవ్ర ఆవేదనకు గురిచేశాయి. కేవలం 81 గంటల వ్యవధిలోనే ముంబైలో 550 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది దాదాపు ఆగస్టు నెల సగటు వర్షపాతంతో సమానం. నగరానికి తాగునీరు అందించే ఏడు సరస్సులలో ఒకటైన విరార్ సరస్సు నిండి పొంగిపొర్లింది. రత్నగిరి, రాయగడ్, హింగోలి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఫడ్నవీస్ ఆదేశించారు. ముంబైలో ప్రస్తుతం జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రోడ్లు, కాలనీలు అన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే, అంధేరి సబ్‌వే, లోఖండ్‌వాలా కాంప్లెక్స్ వంటి ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఈ భారీ వర్షాల కారణంగా పట్టాలు మునిగిపోయి లోకల్ ట్రైన్స్ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబైకి వచ్చే పలు రైళ్లను దారి మళ్లించారు. వర్షాల ప్రభావం విమాన రాకపోకలపై కూడా తీవ్రంగా పడింది. ప్రతికూల వాతావరణం, వెలుతురు సరిగా లేకపోవడంతో ముంబై విమానాశ్రయంలో దిగాల్సిన తొమ్మిది విమానాలు ల్యాండింగ్‌ను రద్దు చేసుకుని గాల్లోనే చక్కర్లు కొట్టాయి..మరో విమానాన్ని అధికారులు వేరే నగరానికి మళ్లించారు. మరో రెండ్రోజులు ముంబైతో పాటు థాణె, రాయ్‌గఢ్‌, పాల్ఘర్‌, నాసిక్‌ ఘాట్‌ ప్రాంతాలకు IMD రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Weather Update: మరో మూడు రోజులు వానలు దంచుడే దంచుడు .. ఈ జిల్లాలకు బిగ్‌ అలర్ట్‌..

Roopchand Fish: రక్తం రుచి మరిగిన చేప.. ఇతర చేపలకు భిన్నం

పీఎం కిసాన్‌ డబ్బులు రాలేదా? అయితే ఇలా చేయండి

ప్రేమించిన అమ్మాయికి ‘బాంబు’ గిఫ్ట్‌ పార్శిల్‌ అందుకున్న భర్త.. చివరికి

పాడైపోయిన పళ్లను రిపేర్ చేసే టూత్‌ పేస్ట్.. శాస్త్రవేత్తల వినూత్న ఆవిష్కరణ

Published on: Aug 20, 2025 04:40 PM