ప్రేమించిన అమ్మాయికి ‘బాంబు’ గిఫ్ట్ పార్శిల్ అందుకున్న భర్త.. చివరికి
దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమించడం లేదని, పెళ్లి చేసుకోవడం లేదని యువతుల జీవితాలలో అంధకారాన్ని నింపుతున్నారు. ఒకసారి ప్రాణాలు పోతే మళ్ళి తిరిగి రావనే విషయాన్ని మరిచి క్షణికావేశంలో ప్రాణాలు తీయడానికి వెనుకాడడం లేదు. మ్యూజిక్ సిస్టమ్‌లో బాంబు పెట్టి ప్రేమించిన మహిళ భర్తకు బహుమతిగా పంపాడో వ్యక్తి.
ఛత్తీస్‌గఢ్‌లో ఘటన జరిగింది. ఖైరాగఢ్‌లోని కుసామి గ్రామానికి చెందిన వినయ్ వర్మ ఎల్రక్టీషియన్. కాలేజీ చదివేప్పటి నుంచే ఓ యువతిని ప్రేమించాడు. ఆ విషయాన్ని ఆమెకూ చెప్పలేదు. ఈ లోపు ఆమెకు పెళ్లయిపోయింది. ఎలాగైనా ఆమె భర్త ఖాన్‌ను చంపాలనుకున్నాడు. గూగుల్‌లో సెర్చ్ చేసారు. ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ చూసి మ్యూజిక్ సిస్టమ్ స్పీకర్‌లో ఐఈడీని అమర్చాడు. మ్యూజిక్ సిస్టమ్ ప్లగిన్ చేయగానే బాంబు పేలిపోయేలా సెట్ చేసాడు. పార్సిల్‌ని అఫ్సర్‌ఖాన్‌కు పంపించాడు. పార్సిల్ అందుకున్న ఖాన్ అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. బాంబు స్క్వాడ్ వచ్చి ప్యాకేజీని పరిశీలించగా, స్పీకర్ లోపల దాచిన 2 కిలోల ఐఈడీ దొరికింది. హత్య కుట్రను భగ్నం చేసిన పోలీసులు.. వినయ్ వర్మను, అతనికి సహకరించిన మిత్రులను అరెస్టు చేశారు. వర్మకు బాంబ్ తయారీ పదార్థాలను అందించిన స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాడైపోయిన పళ్లను రిపేర్ చేసే టూత్ పేస్ట్.. శాస్త్రవేత్తల వినూత్న ఆవిష్కరణ
మెగాస్టార్‌ను కలిసేందుకు కర్నూలు మహిళ సైకిల్ యాత్ర ఏకంగా 218కి.మీ తొక్కుతూనే..
Tamannaah Bhatia: తమన్నాకు అవమానం జాన్వీ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్
విమానం వస్తే.. రైలు ఆగిపోవల్సిందే.. ఎక్కడో తెలుసా?
కడుపునొప్పితో ఆస్పత్రికి పదేళ్ల బాలిక.. సర్జరీ చేసి చూస్తే షాక్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే

