Weather Update: మరో మూడు రోజులు వానలు దంచుడే దంచుడు .. ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..
అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఐదు రోజులు, ఏపీలో మరో మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాల అలర్ట్ ఇచ్చారు వాతావరణశాఖ అధికారులు. తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం.. మహబూబాబాద్ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్.. మరో 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.
వాయుగుండం పశ్చిమ, వాయువ్య దిశలో కదిలి క్రమేపీ బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గురువారం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు.. ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అటు ఏపీలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతటా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయ్. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం.. అల్లూరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడనున్నాయ్. ప్రధాన పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఉత్తరాంధ్ర, యానాంలో మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు.. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని సూచించారు. అటు..ఉత్తరాంధ్రలోనూ భారీ వర్షాలపై వాతావరణశాఖ హెచ్చరికలు చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Roopchand Fish: రక్తం రుచి మరిగిన చేప.. ఇతర చేపలకు భిన్నం
పీఎం కిసాన్ డబ్బులు రాలేదా? అయితే ఇలా చేయండి
ప్రేమించిన అమ్మాయికి ‘బాంబు’ గిఫ్ట్ పార్శిల్ అందుకున్న భర్త.. చివరికి
పాడైపోయిన పళ్లను రిపేర్ చేసే టూత్ పేస్ట్.. శాస్త్రవేత్తల వినూత్న ఆవిష్కరణ
మెగాస్టార్‌ను కలిసేందుకు కర్నూలు మహిళ సైకిల్ యాత్ర ఏకంగా 218కి.మీ తొక్కుతూనే..
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

