Srisailam: శ్రీశైలం వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్

| Edited By: TV9 Telugu

Mar 05, 2024 | 12:30 PM

శ్రీశైలానికి వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాత్రి వేళ కూడా భక్తుల వాహనాలను అనుమతిస్తున్నట్టు దోర్నాల అటవీ క్షేత్రాధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు వెళ్లే భక్తులను మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు రాత్రి వేళల్లో కూడా అనుమతిస్తున్నట్టు తెలిపారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రం..పెద్దదోర్నాల-శ్రీశైలం నల్లమల రహదారి పులుల అభయారణ్యం పరిధిలో ఉంది.

శ్రీశైలానికి వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాత్రి వేళ కూడా భక్తుల వాహనాలను అనుమతిస్తున్నట్టు దోర్నాల అటవీ క్షేత్రాధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు వెళ్లే భక్తులను మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు రాత్రి వేళల్లో కూడా అనుమతిస్తున్నట్టు తెలిపారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రం..పెద్దదోర్నాల-శ్రీశైలం నల్లమల రహదారి పులుల అభయారణ్యం పరిధిలో ఉంది. దీంతో, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ ఈ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేస్తారు. పెద్దదోర్నాల అటవీ శాఖ చెక్‌పోస్ట్ వద్దే వాహనాలను ఆపేస్తారు. అయితే, బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం తాజాగా ఈ నిబంధనకు తాత్కాలిక సడలింపు ఇచ్చారు. వాహనదారులు వన్యప్రాణులకు ఎటువంటి హాని కలగకుండా, నిదానంగా వాహనాలను నడపాలని దోర్నాల క్షేత్రాధికారి సూచించారు. ఈ అవకశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని, నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్లాస్టిక్ సీసాల్లో నీళ్లు తాగితే.. పిల్లలు పుట్టడం కష్టమే

అత్యంత అరుదైన వాకింగ్‌ ఫిష్.. చిలీ సముద్ర జలాల్లో

ఒకప్పటి టాప్‌ విలన్‌ అజిత్‌.. జీవితం దుర్భరం.. కారణం వారే

కాణిపాకం వినాయకుడికి 6 కేజీల బంగారు బిస్కెట్ల విరాళం

కుమారుడి పెళ్లికి వచ్చే అతిథులకు నీతా ఆంబానీ స్పెషల్‌ మెసేజ్‌

Follow us on