Lions Scared of Deer : సడెన్ గా సింహాలకు ఎదురెళ్ళిన జింక పిల్ల.. అదిరిపడింది మృగరాజులు తర్వాత ఎం జరిగిందంటే..!
సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలను చూడగానే సూపర్బ్‌గా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో వీడియో చేరింది. అడవికి రారాజు సింహం. సింహం ఏదైనా జంతువును టార్గెట్ చేస్తే.. పక్కా స్కెచ్‌తో...
Lions Scared of Deer : సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలను చూడగానే సూపర్బ్‌గా అనిపిస్తుంది. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో వీడియో చేరింది. అడవికి రారాజు సింహం. సింహం ఏదైనా జంతువును టార్గెట్ చేస్తే.. పక్కా స్కెచ్‌తో హడావుడి చేయకుండా పని కానిచ్చేస్తుంది. ఎందుకంటే దానికి అతిగా పరుగులు పెట్టి.. అలసిపోవడం ఇష్టం ఉండదు. కానీ ఏదైనా జంతువును టార్గెట్ చేసిందంటే మాత్రం ఆ జంతువును మట్టికరింపించే వరకు వదిలిపెట్టదు.
కానీ ఈ వీడియోలో రివర్స్ జరిగింది. రోడ్డుకు ఇరువైపుల అడవి ఉన్న చోట… ఓ బుల్లి జింక రోడ్డును వేగంగా దాటాలనే ఉద్దేశంతో యమస్పీడ్‌తో దూసుకొచ్చింది. ఐతే… అదే రోడ్డుపై సింహాలు వెళ్తూ ఉన్నాయి. సింహాలను గమనించకుండా రోడ్డుపైకి దూసుకొచ్చిన జింక తన పరుగుకు సడెన్ బ్రేక్ వేసింది. వెంటనే అక్కడి సింహాలన్నీ జింకను వేటాడేందుకు పొజిషన్‌లోకి వచ్చేశాయి. అంతే… జింక సడెన్ బ్రేక్ వేసుకున్నప్పటికీ ఆ స్పీడ్‌కు ఆగలేకపోయింది. వెళ్లి సరిగ్గా సింహాల మధ్యలో పడి.. వాటికి ఆహారమైపోయింది.
విషయమేంటంటే సింహాలు వాటి దారిన అవి పోతున్న టైమ్‌లో జింక దూసుకొచ్చి వాటికి ఆహారంగా మారింది. అసలు వేట అన్నదే లేకుండా జింకే వచ్చి సింహాలకు చిక్కడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరో విషయం ఏంటంటే.. మొదట దూసుకొచ్చిన జింకను చూసి సింహాలు అదిరిపడ్డాయి.. కానీ క్షణాల్లోనే అవి తిరిగి అలర్ట్ అయ్యాయి. ఈ వీడియోను మీరు బాగా పరిశీలిస్తే ఆ విషయం అర్థమవుతుంది. మొత్తంమీద అలా సింహాలను భయపెట్టిన జింక… చివరికి వాటికి ఆహారంగా మారింది.
When arriving at the wrong time pic.twitter.com/POnsJ2kJ1T
— Life and nature (@afaf66551) February 20, 2021