AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Deepam Today Episode: కార్తీక దీపం సీరియల్ లోని ఈరోజు హైలెట్స్.. కార్తీక్ ను ఒప్పించిన శౌర్య.. మోనితకు టెన్షన్..

కార్తీక దీపం సీరియల్ వెయ్యి ఎపిసోడ్స్ కు చేరువ కానున్నది. ఈరోజు 970 వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. వంటలక్క మోనిత అనే గీతను దాటి కార్తీక్ ను చేరుకోనుందా అనే ప్రేక్షకుల ప్రశ్నకు ఈరోజు సమాధానం దొరుకుంటుందో లేదో చూద్దాం..!

Karthika Deepam Today Episode: కార్తీక దీపం సీరియల్ లోని ఈరోజు హైలెట్స్.. కార్తీక్ ను ఒప్పించిన శౌర్య.. మోనితకు టెన్షన్..
Surya Kala
|

Updated on: Feb 23, 2021 | 10:39 AM

Share

karthika deepam serial : తెలుగు లోగిళ్లలో దాదాపు మూడేళ్లకు పైగా సందడి చేస్తున్న సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ వెయ్యి ఎపిసోడ్స్ కు చేరువ కానున్నది. ఈరోజు 970 వ ఎపిసోడ్ ప్రసారం కానుంది. వంటలక్క మోనిత అనే గీతను దాటి కార్తీక్ ను చేరుకోనుందా అనే ప్రేక్షకుల ప్రశ్నకు ఈరోజు సమాధానం దొరుకుంటుందో లేదో చూద్దాం..!

దీప ఇంటికి వచ్చిన అత్తగారు సౌందర్య హిమను డబులిచ్చి ఏమైనా కొనుక్కోమని బయటకు పంపిస్తుంది. తర్వాత కార్తీక్ కోర్టు కు వెళ్లడం లేదని.. కేసు వాపసు తీసుకున్నాడని షాకింగ్ న్యూస్ దీపకు చెబుతుంది. నీ ఆలోచన ఏమైనా మోనితకు చెప్పవా అసలు తులసి దగ్గరకు ఎందుకు వెళ్ళావు అంటూ మోనిత పంపించిన వీడియో దీపకు చూపిస్తుంది అత్తగారు. అదే సమయంలో దీప తులసి భర్త విషయం బయటపెట్టాలా.. నా స్వార్ధం కోసం వేరే వ్యక్తి జీవితాన్ని ఎలా బయటపెడతా అంటూ ఆలోచనలో మునిగిపోతుంది.

ఇక కార్తీక్.. మోనిత ఇంట్లో హిమ గురించి బాధపడుతుంటే.. మోనిత హిమను కార్తీక్ దగ్గరకు తీసుకొస్తానంటుంది. దీపకు అంత తెలివి రావడానికి కారణం మీ అమ్మ తెలివే కదా అంటూ వెటకారంగా మాట్లాడుతుంటే.. కార్తీక్ కోపంగా మధ్య మా అమ్మని తీయొద్దు.. తనకు కూడా దీప ఆలోచన నాతో పాటే తెలిసింది. అంటాడు.. సరే మీ ఆవిడకి బోలెడన్ని తెలివితేటలున్నాయి అని మోనిత కోపంగా అంటుంది.

నేను కన్న ప్రేమ.. పెంచిన ప్రేమ అంటూ అనవసరంగా పంతానికి పోయాను అని కార్తీక్ బాధపడుతుంటే.. హిమను తాను కార్తీక్ దగ్గరకు తీసుకొస్తాను అంటుంది మోనిత. అది అంత ఈజీకాదు పదేళ్లు పెంచిన ప్రేమ.. కన్న తల్లిని మరిపించలేకపోయింది. అని కార్తీక్ అంటే.. వెంటనే మోనిత మారు తల్లిగా ప్రయత్నిస్తాను అని చెబుతుంది. నాకు కొంచెం టైం కావాలని కార్తీక్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

సౌందర్య ఇంట్లో ఉన్న శౌర్య కార్తీక్ కోసం ఎదురు చూస్తూ నాన్నా నీకోసమే ఎదురుచూస్తున్నా అంటే.. హిమ అని పలకరిస్తారు.. దీంతో శౌర్య అప్ సెట్ అయ్యి .. నాన్న చేతిని వదిలేస్తుంది.. దీంతో కార్తీక్ శౌర్యకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాడు. శౌర్య నవ్వుతు.. నాన్న నీ దగ్గరకు హిమను తీసుకొచ్చే ప్లాన్ నా దగ్గర ఒకటి ఉంది.. అని చెబుతుంది. అయితే నాకు హిమ తో పాటు నువ్వు కూడా నాదగ్గరే ఉండి పోవాలి అనే కండిషన్ పెట్టాడు. థాంక్స్ నాన్నా అని చెబుతుంది శౌర్య. ఇదంతా అక్కడే ఉన్న శ్రావ్య సంతోషపడింది. శౌర్య మాత్రమే దీపని కూడా ఇంట్లోకి తీసుకుని రాగలదు అని మనసులో అనుకుని శౌర్యాని ప్రేమగా దగ్గరకి తీసుకుంటుంది.

దీప తన ఇంట్లో తన భవిష్యత్ పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తుంటుంది. కార్తీక్ కి తన మీద ఉన్న అనుమానం పోవాలంటే తులసి జీవితం బయటపెట్టాల్సిందేనా అని ఆలోచిస్తుంది.. ఏ విషయమైనా అత్తగారికి చెప్పి ఆమె సలహాతో ముందడుగు వేయాలని ఆలోచిస్తుంది. రేపు అత్త సౌందర్యను గుడికి రమ్మనమని చెప్పాలని అనుకుంటుంది దీప. ఇక మోనిత తన ఇంట్లో టెన్షన్ తో గులాబీ రేఖలను తెంపుతూ.. దీప సౌందర్య కు నిజం చెప్పిందా.. లేక కార్తీక్ కు ఈ నిజం తెలిసిందా దీప కార్తీక్ కలిసిపోయారా అని ఆలోచిస్తుంటుంది. పనిమనిషి ప్రియమణి అప్పుడు మోనిత కు రేపు గుడికి వెళ్ళమని సలహా ఇస్తుంది. అంతా మంచే జరుగుతుందని చెబుతుంది.

ఆనందరావు, సౌందర్యలు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా ఆనందరావు పెద్దపెద్దగా నవ్వుతుంటాడు. అది చూసిన సౌర్య ఇద్దరితో.. ‘నాన్న ఇలా గట్టిగా నవ్వడం నేను ఎప్పుడూ చూడలేదు.. ఒక్కసారి మాత్రం చూశాను.. మోనితతో మాట్లాడుతున్నప్పుడు.. చూశాను.. మీలా నాన్న గట్టిగా ఎందుకు నవ్వడు.. మా అమ్మ ముందు ఎలాగో నవ్వడు..? కనీనం మీ ముందైనా ఎందుకు నవ్వడు నాన్నమ్మా..?’ అంటూ ప్రశ్నిస్తుంది. ఆ మాటకు సౌందర్య బాధగా ఆలోచనలో పడుతుంది. ‘నిజమే కార్తీక్ మనస్పూర్తిగా నవ్వి ఎన్నేళ్లు అయ్యింది..? అంటూ తనలో తానె ప్రశ్నించుకుంటుంది.. నెక్స్ట్ ఏమైందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..

Also Read:

బయటపడుతున్న కనకదుర్గమ్మ గుడి అక్రమాలు.. చర్యలు చేపట్టిన ఏపీ సర్కార్.. 13 మందిపై వేటు

గుజరాత్‌లోని ఆరు నగరాల్లో ప్రారంభమైన కౌంటింగ్.. మరి కాసేపట్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం..