Gujarat Civic Polls Results: గుజరాత్‌లోని ఆరు నగరాల్లో ప్రారంభమైన కౌంటింగ్.. మరి కాసేపట్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం..
Municipal Corporation Elections Results: గుజరాత్ రాష్ట్రంలోని ఆరు మునిసిపల్ కార్పోరేషన్లకు ఎన్నికలు ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు సాయంత్రం నాటికి ఆయా ప్రాంతాల్లోని అభ్యర్థుల భవితవ్యం..
Municipal Corporation Elections Results: గుజరాత్ రాష్ట్రంలోని ఆరు మునిసిపల్ కార్పోరేషన్లకు ఎన్నికలు ఆదివారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు సాయంత్రం నాటికి ఆయా ప్రాంతాల్లోని అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఆరు నగరాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 9గంటలకు ప్రారంభమైంది. అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్‌కోట్, జామ్‌నగర్, భావ్‌నగర్ నగరాల్లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, ఏఐఎంఎం పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. మొత్తం ఆరు నగరపాలక సంస్థల్లోని 575 సీట్లల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రాంతాలన్నింటిలో మొత్తం 2,276 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఈ ఎన్నికల్లో అహ్మదాబాద్‌లో అత్యల్పంగా 42.51 శాతం ఓటింగ్ నమోదు కాగా.. అత్యధికంగా జామ్‌నగర్‌లో 53.38 శాతం ఓటింగ్ నమోదైంది. రాజ్‌కోట్‌లో 50.71%, భావ్‌నగర్‌లో 49.46%, వడోదరలో 47.84%, సూరత్లో 47.14% పోలింగ్ నమోదైంది. ఈ నగర పాలక సంస్థలన్నింటిలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ రోజు మధ్యాహ్నం నాటికి అభ్యర్థుల భవితవ్య తేలనుందని అధికారులు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ కోసం కోవిడ్ నిబంధనలతో ఏర్పాట్లు చేశారు.
Also Read: