బీహార్‌లో ఘోర ప్రమాదం… బ్యాండ్‌ బృందంతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న ట్రక్కు.. 8మంది మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

బీహార్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారు, ఆటో ఢీకొనడంతో 8 మంది దుర్మరణం పాలయ్యారు.

  • Balaraju Goud
  • Publish Date - 8:34 am, Tue, 23 February 21
బీహార్‌లో ఘోర ప్రమాదం... బ్యాండ్‌ బృందంతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న ట్రక్కు.. 8మంది మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

Road Accident in Bihar : బీహార్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ, ఆటో ఢీకొనడంతో 8 మంది దుర్మరణం పాలయ్యారు. కటిహార్ జిల్లాలోని కుర్షేలా సమీపంలో 31వ జాతీయ రహదారిపై 10మందితో వెళ్లున్న ఆటో.. ట్రక్కు  ఢీకొవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పది మంది సభ్యుల కూడిన బ్యాండ్‌ బృందం పూర్నియా నుంచి ఆటోలో బయలు దేరారు. కుర్షేలా సమీపంలోకి రాగానే.. ఎదురుగా వస్తున్న ట్రక్కు, ఆటో ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనా స్థలిలోనే మృతి చెందాగా.. మరొకరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మరణించారు. మిగతా నలుగురు తీవ్రగాయాలతో పోరాడుతూ ఆస్పత్రిలో చనిపోయారని పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు గాయాల పాలయ్యారు.

ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుకున్న పోలీసులు.. ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు. ఘటన తర్వాత కారు డ్రైవర్‌ పరారైనట్లు పోలీసు అధికారి అమర్‌కాంత్ తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని అర్జున్‌ మోచి(50), కిశోర్‌ పాస్వాన్‌(45), ధర్మేంద్ర కుమార్‌ మండాల్‌(50), సుశీల్‌ కుమార్‌ మోచి(30), చోటేలాల్‌ రామ్‌(42)గా గుర్తించినట్లు కటిహార్‌ సామాజిక వైద్యశాల డాక్టర్‌ అనుపమ్‌ అలోక్‌ తెలిపారు. వీరంతా మజ్‌దిహా గ్రామానికి చెందిన వారిగా తెలిపారు.

ఇదీ చదవండిః Blast In Gujarat: గుజరాత్‌లో భారీ పేలుడు… 10 కి.మీల మేర దద్దరిల్లిన భవనాలు.. భయందోళనలో ప్రజలు..