Watch Video: నకిలీ విత్తనాల ముఠా గుట్టు రట్టు.. ఆందోళనలో రైతులు..
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాల డంప్ గుర్తించారు. పోలీసులు, వ్యవసాయ అధికారుల జాయింట్ ఆపరేషన్లో ఈ నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. జిల్లా కేంద్రంగా భారీగా నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు అధికారులు. నకిలీ విత్తనాలను అమ్ముతూ అమాయక రైతులను నిండా ముంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. బ్రాండెడ్ సీడ్స్ ప్యాకెట్లలలో విత్తనాల నింపుతూ విక్రయం సాగిస్తున్న ముఠా పట్టుబడింది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాల డంప్ గుర్తించారు. పోలీసులు, వ్యవసాయ అధికారుల జాయింట్ ఆపరేషన్లో ఈ నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. జిల్లా కేంద్రంగా భారీగా నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు అధికారులు. నకిలీ విత్తనాలను అమ్ముతూ అమాయక రైతులను నిండా ముంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. బ్రాండెడ్ సీడ్స్ ప్యాకెట్లలలో విత్తనాల నింపుతూ విక్రయం సాగిస్తున్న ముఠా పట్టుబడింది. జిల్లా కేంద్రంలోని రాంనగర్ సమీపంలోని ఓ గోదాంలో సాధారణ పత్తి విత్తనాలను ప్రముఖ కంపెనీల విత్తనాలుగా మార్చి విక్రయిస్తున్నారు. ఇలా చేస్తూ పోలీసుల చేతికి చిక్కింది ఈ ముఠా. ఈ నకిలీ విత్తనాల ముఠా నిర్వాహకుడు సామ అశోక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎందరి చేతులు ఉన్నాయో కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే విత్తనాలు కొనుగోలు చేసి మోసపోయామని రైతులు గుండెలు బాదుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..