Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: బుల్లెట్ బండి‎లో చెలరేగిన మంటలు.. ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే..

Watch Video: బుల్లెట్ బండి‎లో చెలరేగిన మంటలు.. ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే..

Noor Mohammed Shaik

| Edited By: Srikar T

Updated on: May 24, 2024 | 8:37 PM

బుల్లెట్ బండి పేలిన ప్రమాదంలో గాయపడిన 9 మందిలో మూగ్గురు మరణించగా, 6 మంది చికిత్స తీసుకుంటున్నారు. మే12న  ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మొఘల్‌పుర పోలీస్‌స్టేషన్ పరిధిలోని అస్లాం ఫంక్షన్ హాల్ దగ్గర వెళ్తున్న ఓ బుల్లెట్‌పై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బుల్లెట్ బైక్‎పై వెళ్తున్న వ్యక్తికి మంటలు అంటుకోవడంతో స్థానికులు నీళ్లు పోసి మంటలను అదుపులోకి తెచ్చారు.

హైదరాబాద్‌లో మే 24: బుల్లెట్ బండి పేలిన ప్రమాదంలో గాయపడిన 9 మందిలో మూగ్గురు మరణించగా, 6 మంది చికిత్స తీసుకుంటున్నారు. మే12న  ఆదివారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మొఘల్‌పుర పోలీస్‌స్టేషన్ పరిధిలోని అస్లాం ఫంక్షన్ హాల్ దగ్గర వెళ్తున్న ఓ బుల్లెట్‌పై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బుల్లెట్ బైక్‎పై వెళ్తున్న వ్యక్తికి మంటలు అంటుకోవడంతో స్థానికులు నీళ్లు పోసి మంటలను అదుపులోకి తెచ్చారు. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉన్న స్థానికులు స్పందించి బైక్ మంటలార్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ మంటలార్పే క్రమంలో బైక్ ఒక్కసారిగా పేలింది. దీంతో మంటలు ఆర్పుతున్న 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడున్న ప్రజలు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. కాగా, ఈ ఘటనలో చికిత్స పొందుతూ ఇప్పటికే ముగ్గురు మరణించారు. ప్రస్తుతం మరో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బైక్ లో మంటలు అంటుకోవడానికి కారణాలను గుర్తిస్తున్నారు. వేసవి ఎండల కారణంగా మంటలు వ్యాపించాయా లేక ఏ ఇతర కారణాల వల్ల మంటలు చెలరేగాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..