‘అన్నం వండేవాడు.. మంచిగా ఉండేవాడు’.. కోల్‌కతా ఘటన నిందితుడి తల్లి కీలక వ్యాఖ్యలు
దేశానికి రాజైనా తల్లికి కొడుకే. చట్టానికి, సమాజానికి క్రూరుడైనా తల్లికి బిడ్డే అని ఆమె మాటలు వింటే అర్ధమవుతుంది. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారానికి పాల్పడ్డ మృగాడి తల్లి మాత్రం తన బిడ్డ ఎంతో మంచివాడని చెబుతోంది. అంతేకాదు ఘటన జరిగినప్పటి నుంచి తన కుమారుడిని చూడలేదని తెలిపింది.
దేశానికి రాజైనా తల్లికి కొడుకే. చట్టానికి, సమాజానికి క్రూరుడైనా తల్లికి బిడ్డే అని ఆమె మాటలు వింటే అర్ధమవుతుంది. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారానికి పాల్పడ్డ మృగాడి తల్లి మాత్రం తన బిడ్డ ఎంతో మంచివాడని చెబుతోంది. అంతేకాదు ఘటన జరిగినప్పటి నుంచి తన కుమారుడిని చూడలేదని తెలిపింది. కోర్టులో ఎలా అప్పీల్ చేయాలో తనకు తెలియదని సంజయ్ రాయ్ తల్లి తాజాగా ఇండియా టుడే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. తనకు అన్నం వండిపెట్టడంతో సహా రాయ్ తనని చక్కగా చూసుకునేవాడంది. సంజయ్ రాయ్ కళాశాల గ్రాడ్యుయేట్ అని ఎన్‌సిసి కార్ప్స్‌లో భాగమని, బాక్సింగ్ నేర్చుకున్నాడనీ అతని తండ్రి చాలా కఠినంగా క్రమశిక్షణతో ఉండేవాడనీ చెప్పింది. బహుశా తాను ఇంకా కఠినంగా ఉండి ఉంటే ఇలా జరిగేది కాదని తెలిపింది. సంజయ్ రాయ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అతని ‘దుష్ప్రవర్తన‘ కారణంగా అతని మునుపటి ముగ్గురు భార్యలు అతనిని విడిచిపెట్టారని ఇరుగుపొరుగు వారు చెబుతున్న విషయాలని అతని తల్లి ఖండించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

