మీకు కూరగాయలు ఫ్రీగా కావాలా.? ఇదేదో ఫేక్ వార్త అనుకోవద్దు.. అసలు విషయం తెలిస్తే

మీకు కూరగాయలు ఫ్రీగా కావాలా.? ఇదేదో ఫేక్ వార్త అనుకోవద్దు.. అసలు విషయం తెలిస్తే

G Sampath Kumar

| Edited By: Ravi Kiran

Updated on: Aug 27, 2024 | 12:24 PM

మీకు కూరగాయలు ఫ్రీగా కావాలంటే పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌కు రండి. ఇదేదో ఫేక్ వార్త అనుకుంటున్నారా? నిజమేనండి. కూరగాయల ధరలు ఆకాశానంటుతున్నాయి.

మీకు కూరగాయలు ఫ్రీగా కావాలంటే పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌కు రండి. ఇదేదో ఫేక్ వార్త అనుకుంటున్నారా? నిజమేనండి. కూరగాయల ధరలు ఆకాశానంటుతున్నాయి. కానీ పెద్దపల్లిలో మాత్రం ఉచితంగా అందిస్తున్నారు. అదేంటి అనుకుంటున్నారా.! ఈ స్టోరీ చదివేసేయండి.

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌లో వ్యాపారులు టన్నుల కొద్ది కూరగాయలను ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఫ్రీగా కూరగాయలు అందిస్తున్నారని తెలియడంతో ప్రజలు వేలాదిగా తరలివచ్చి సంచులు సంచులుగా కూరగాయలు తీసుకుని వెళ్లారు. అసలు విషయం ఏంటంటే.? కూరగాయల మార్కెట్‌లో హోల్‌సేల్, రిటైల్ కూరగాయల వ్యాపారుల మధ్య వివాదం నెలకొనడంతో రిటైల్ వ్యాపారులు ఉచితంగా కూరగాయలు అందజేశారు.

ఒప్పందం ప్రకారం హోల్‌సేల్ వ్యాపారులు రిటైల్‌గా కూరగాయలు అమ్మకూడదని ఉండగా.. వారు నిబంధనలు అతిక్రమించి కిలోల చొప్పున కూరగాయలు రోజు మొత్తం అమ్ముతుండడంతో ఆగ్రహించిన రిటెయిల్ వ్యాపారులు కూరగాయలన్నీ ఫ్రీగా పంచిపెట్టారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూరగాయలు ఉచితంగా పంపిణి చేస్తామని వ్యాపారాలు చెబుతున్నారు. ఈ ఇద్దరి వ్యాపారుల విభేదాల కారణంగా.. వినియోగదారులు పండుగ చేసుకుంటున్నారు. కూరగాయలు కొనుగోలుకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు.

Published on: Aug 27, 2024 12:24 PM