YouTube: యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్.. రెన్యువల్ సబ్ స్క్రిప్షన్ ధరలు.
వినియోగదారులకు యూట్యూబ్ బిగ్ షాకిచ్చింది. యూట్యూబ్ సబ్‌స్క్రిప్షన్ ధరలను పెంచేసింది. ఫ్యామిలీ, స్టూడెంట్, పర్సనల్ ప్లాన్ ఇలా అన్నింటిపైనా దాదాపు 58శాతం ధరల్ని పెంచింది. యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లను పెంచుకోవటంలో భాగంగా ఏటా ప్రీమియం ధరలను పెంచడం చేస్తోంది. దీంతో ఇకపై యాడ్స్ లేకుండా కంటెంట్ చూసేందుకు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సిందే.
వినియోగదారులకు యూట్యూబ్ బిగ్ షాకిచ్చింది. యూట్యూబ్ సబ్‌స్క్రిప్షన్ ధరలను పెంచేసింది. ఫ్యామిలీ, స్టూడెంట్, పర్సనల్ ప్లాన్ ఇలా అన్నింటిపైనా దాదాపు 58శాతం ధరల్ని పెంచింది. యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లను పెంచుకోవటంలో భాగంగా ఏటా ప్రీమియం ధరలను పెంచడం చేస్తోంది. దీంతో ఇకపై యాడ్స్ లేకుండా కంటెంట్ చూసేందుకు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సిందే.
భారత్లో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరలను పెంచేసింది. ఫ్యామిలీ, స్టూడెంట్, వ్యక్తిగత ప్లాన్లతో పాటు రెన్యువల్ సబ్‌స్క్రిప్షన్ ధరల్ని 58శాతం పెంచేస్తూ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. కొత్త ధరలు కంపెనీ వెబ్‌సైట్‌లో వచ్చాయి. ఇప్పటికే వినియోగదారులకు వీటికి సంబంధించి ఈ-మెయిల్స్ పంపడం ప్రారంభించింది. యూట్యూబ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారు యాడ్స్ లేకుండా కంటెంట్ చూడొచ్చు. 1080pలో అధిక బిట్రేట్ స్ట్రీమింగ్, ఆఫ్లైన్ డౌన్లోడ్, బ్యాక్గ్రౌండ్ ప్లేబ్యాక్, యూట్యూబ్ మ్యూజిక్లో యాడ్స్ లేకుండా చూడొచ్చు. ఇలాంటి పలు రకాల ప్రయోజనాలను సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారు పొందొచ్చు.
యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకొనేందుకు యూట్యూబ్ 30 సెకండ్ల పాటు unskippable యాడ్స్ ఆప్షన్ను చాలాకాలం క్రితమే తీసుకొచ్చింది. యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లను పెంచుకోవటంలో భాగంగా ఏటా ప్రీమియం ధరలను పెంచడం, తగ్గించడం చేస్తోంది. ఇంతకుముందు రూ.129గా ఉన్న వ్యక్తిగత ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధరను రూ.149కి పెంచింది. గతంలో రూ.189గా ఉన్న ఫ్యామిలీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధరను ప్రస్తుతం రూ.299కి పెంచింది. స్టూడెంట్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ధరను రూ.79 నుంచి రూ.89కి పెంచింది. గతంలో కేవలం రూ.139గా ఉన్న వ్యక్తిగత ప్రీపెయిడ్ నెలవారి ప్లాన్ ధరను 159కి సవరించింది. వ్యక్తిగత త్రైమాసిక ప్లాన్ ధరను రూ.399 నుంచి రూ.459కి పెంచింది. గతంలో రూ.1290గా ఉన్న వ్యక్తిగత వార్షిక ప్లాన్ ధరను రూ.1490కి పెంచింది. అంటే ఏకంగా 200 రూపాయలు అధికంగా పెంచేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.