Pushya Nakshatra: 677 ఏళ్ల తర్వాత అద్భుతమైన రోజు.. పట్టిందల్లా బంగారమే..! దీని ప్రత్యేకత ఏంటో తెలుసా..? (వీడియో)
ఏదైనా విలువైన వస్తువులు కొనాలనుకున్నప్పుడు మంచిరోజు చూసుకోవడం భారతీయలుకు ఒక అలవాటు. బంగారు ఆభరణాలు, వాహనాలు, భూములు, ఇల్లు.. ఇలా ఏది కొనాలన్నామంచి రోజు ఎప్పుడు ఉందో అని ఒకటి పదిసార్లు చూసుకుంటారు.
ఏదైనా విలువైన వస్తువులు కొనాలనుకున్నప్పుడు మంచిరోజు చూసుకోవడం భారతీయలుకు ఒక అలవాటు. బంగారు ఆభరణాలు, వాహనాలు, భూములు, ఇల్లు.. ఇలా ఏది కొనాలన్నామంచి రోజు ఎప్పుడు ఉందో అని ఒకటి పదిసార్లు చూసుకుంటారు. ఇటువంటి సందర్భాల్లో పుష్యమి నక్షత్రానికి ఎంతో ప్రాముఖ్య ఉంది. ప్రతి నెలలోనూ పుష్యమి నక్షత్రం వస్తున్నప్పటికీ.. ఈ సంవత్సరం దీనికి ఓ ప్రత్యేక ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి, ఆ రోజు ఎటువంటి కార్యక్రమాలు చేయవచ్చు అనేది జ్యోతిషులు వివరిస్తున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏదైనా శుభదినాన మంచి పనులు చేపట్టడం, లేదా నూతన కార్యక్రమాలు ప్రారంభించడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం వల్ల అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తుంటారు. ఈ క్రమంలోనే ఏడాదిలో ఒకసారి వచ్చే పుష్యమి నక్షత్రం కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. అయితే ఈ ఏడాది దీపావళికి ముందు అంటే అక్టోబర్ 28న వచ్చే పుష్య నక్షత్రం అనేక విధాలుగా చాలా శుభప్రదమైనదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అక్టోబర్ 28న గురువారం కావడం, ఆరోజు పగలు, రాత్రి అంతా పుష్య నక్షత్రం ఉండటంతో.. ఆ రోజు గురు పుష్య యోగం ఏర్పడుతుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఈ రోజు ఏర్పడ్డ అమృత సిద్ధి యోగం మరోసటి రోజు అంటే.. అక్టోబర్ 29 ఉదయం 6.30 గంటల వరకూ కొనసాగుతుందని అంటున్నారు. అంతే కాదండోయ్..677 ఏళ్ల క్రితం అంటే 1344లో ఏర్పడ్డ గ్రహస్థితులే ఈ ఏడాది అక్టోబర్ 28న కూడా ఏర్పడనున్నాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ఈ గురుపుష్య యోగ కాలంలో నిర్వహించే మంచి కార్యక్రమాలన్నీ విజయవంతమవుతాయని, ఒక రకంగా ఆరోజు పట్టిందల్లా బంగారమే..అంటే మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Samantha Painting Photos: నెట్టింట వైరల్ అవుతున్న ‘సమంత’ పెయింటింగ్ వేస్తున్న ఫొటోస్.. ఎవరి బొమ్మ గీసిందో చూడండి..
Vijay Sethupathi Bike Photos: BMW బైక్ కొన్న ‘మక్కల్ సెల్వన్’.. స్వయంగా డ్రైవింగ్ చేస్తూ వెళ్లిన ‘విజయ్ సేతుపతి’.. వైరల్ అవుతున్న ఫొటోస్..
Electric Scooters: 40 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 కి.మీ. ప్రయాణం.. (వీడియో)