Karwa Chauth Gift: కర్వా చౌత్ సందర్భంగా భార్యకు గోవిందా.. అదిరిపోయే గిఫ్ట్..! నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో..
దీపావళికి పది రోజులు ముందు వచ్చే కర్వా చౌత్… పండగను ఉత్తరాది ప్రజలు ఎంతో వేడుకగా జరుపుకొంటారు. ఈ పండగను పురస్కరించుకుని మహిళలు తమ జీవిత భాగస్వామి క్షేమంగా ఉండాలని కోరుతూ ఉపవాస దీక్ష చేస్తారు.
దీపావళికి పది రోజులు ముందు వచ్చే కర్వా చౌత్… పండగను ఉత్తరాది ప్రజలు ఎంతో వేడుకగా జరుపుకొంటారు. ఈ పండగను పురస్కరించుకుని మహిళలు తమ జీవిత భాగస్వామి క్షేమంగా ఉండాలని కోరుతూ ఉపవాస దీక్ష చేస్తారు. తమ భర్త ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని, కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక పెళ్లికాని అమ్మాయిలైతే తమకు మంచి భర్త రావాలని పూజలు చేస్తారు. ఈ ఏడాది కూడా ఉత్తరాది ప్రజలతో పాటు బాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ ఫెస్టివల్‌ను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
‘కర్వా చౌత్’ పండుగ సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవిందా తన సతీమణి సునీతకు ఖరీదైన బీఎండబ్ల్యూ కారును బహుమతిగా అందించారు. ‘నా ప్రాణ స్నేహితురాలు..నా జీవిత భాగస్వామి…నా ఇద్దరు అందమైన పిల్లలకు తల్లివి అయిన నీపై నాకున్న ప్రేమ వెలకట్టలేనిది. అయినా మా అందరి క్షేమం కోరి నీవు ఆచరించే కర్వాచౌత్ సందర్భంగా ఒక చిన్న బహుమతిని నీకు అందిస్తున్నాను’ అంటూ కారును గిఫ్ట్‌గా తన భార్యకు అందించారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు గోవిందా. ఆయనతో పాటు అమితాబ్ బచ్చన్, శిల్పాశెట్టి, యామీ గౌతమ్, వరుణ్ ధావన్, పంకజ్ త్రిపాఠి, మీరా కపూర్, కపిల్ శర్మ తదితరులు తమ సెలబ్రేషన్స్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మరి వాటిపై ఓ లుక్కేసి, వారి ఆనందాన్ని మీరూ పాలుపంచుకోండి..
మరిన్ని చదవండి ఇక్కడ: Samantha Painting Photos: నెట్టింట వైరల్ అవుతున్న ‘సమంత’ పెయింటింగ్ వేస్తున్న ఫొటోస్.. ఎవరి బొమ్మ గీసిందో చూడండి..
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

