Gas Cylinder Price సామాన్యుడిపై మరింత భారం మోపిన చమురు సంస్థలు.. భారీగా పెరిగిన గ్యాస్ ధర..
పేద, మధ్యతరగాతి వర్గాలకు బ్యాడ్ న్యూస్. దేశీయ చమురు సంస్థలు వినియోగదారులకు మరో షాకిచ్చాయి. గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ మరోసారి సామాన్యుడిపై మరింత భారం మోపింది.
పేద, మధ్యతరగాతి వర్గాలకు బ్యాడ్ న్యూస్. దేశీయ చమురు సంస్థలు వినియోగదారులకు మరో షాకిచ్చాయి. గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతూ మరోసారి సామాన్యుడిపై మరింత భారం మోపింది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధర మరోసారి పెరిగింది. బండ ధరను 50 రూపాయలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో.. గ్యాస్ బండ రేటు 1100 దాటేసింది. ఈ నిర్ణయంతో ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న సామన్యులపై మరింత భారం పడనుంది. తాజా పెంపుతో ఢిల్లీ లో ప్రస్తుతం 1003 రూపాయలుగా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర 1053 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్‌లో గ్యాస్ బండ ధర 1055 రూపాయలనుంచి 1105 రూపాయలకు చేరింది. మాములుగా అయితే ప్రతి నెల 1న వీటి ధరల్లో మార్పులు చేర్పులు చేస్తాయి చమురు సంస్థలు. ఈ నెల 1న 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను 183 మేర తగ్గించాయి. తాజాగా నెలలో 5 రోజులు గడిచిన తర్వాత డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచడం చర్చనీయాంశంగా మారింది. కాగా పెంచిన గ్యాస్ సిలిండర్ ధర జూలై 6 నుంచే అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?