Anemia: కాళ్లు, చేతుల్లో ఈ లక్షణాలా.? మీకు రక్త హీనత ఉన్నట్లే.! నిపుణులు మాటేంటి.?
ఈ మధ్య కాలంలో రక్త హీనత సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. మారుతున్న జీవన విధానాలు, ఆహార అలవాట్ల కారణంగా రక్త హీనత సమస్య పెరుగుతోంది. హిమోగ్లోబిన్ లోపం కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కారణంగా మారుతోంది. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది. హిమోగ్లోబిన్ లోపంతో ఇబ్బంది పడే వారికి సరైన సమయంలో చికిత్స అందించకపోతే.. తీవ్ర సమస్యగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ మధ్య కాలంలో రక్త హీనత సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. మారుతున్న జీవన విధానాలు, ఆహార అలవాట్ల కారణంగా రక్త హీనత సమస్య పెరుగుతోంది. హిమోగ్లోబిన్ లోపం కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కారణంగా మారుతోంది. ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది. హిమోగ్లోబిన్ లోపంతో ఇబ్బంది పడే వారికి సరైన సమయంలో చికిత్స అందించకపోతే.. తీవ్ర సమస్యగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో రక్తం తగ్గితే.. నిత్యం చిరాకు, అలసట బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే శరీరంలో సరిపడ రక్తం లేకపోతే మెదడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.
శరీరంలో సరిపడ రక్తం లేకపోవడాన్ని ముందస్తుగానే కొన్ని లక్షణాల ఆధారంగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రధానమైనవి కాళ్లూ, చేతులూ జలదరిస్తున్నట్లు ఉండడం. శరీరంలో తగినంత రక్తం లేకపోతే.. శరీరంలోని సిరలకు ఆక్సిజన్ సరిగ్గా అందదు. దీంతో చేతులు, కాళ్లలో జలదరింపుగా ఉంటుంది. అలాగే తీవ్రమైన అలసట వేధిస్తుంది. తల తిరిగుతున్నట్లు భావన కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే శరీరంలో రక్తం తగ్గితే.. జుట్టు సైతం రాలిపోతుందంటున్నారు. ఆకస్మాత్తుగా జుట్టు రాలితే శరీరంలో రక్తం తగ్గిందని అర్థం చేసుకోవాలి. ఇక నోటిలో పుండ్లు కావడం కూడా రక్త హీనత లక్షణాల్లో ఒకటని చెబుతున్నారు. దీని వల్ల ఆహారం తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడుతాయి. అలాగే మొటిమల సమస్య వేధిస్తుంది. శరీరంలో రక్తం తగ్గితే ముఖం పసుపు రంగులోకి మారుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే.. వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇక రక్త హీనత సమస్యకు చెక్ పెట్టడానికి తీసుకునే ఆహారంలో తగినంత ఫైబర్, ప్రోటీన్, పండ్లు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.