Bleeding Eye: కరోనా కంటే డేంజర్.. బ్లీడింగ్ ఐ వైరస్ !!
ఆఫ్రికాలో పుట్టింది. ప్రపంచాన్ని వణికిస్తోంది. అదే మార్బర్గ్ వైరస్ అలియాస్ బ్లీడింగ్ ఐ వైరస్. అది వస్తే అంతే సంగతులు. అది సోకినవాళ్లలో 50 శాతం మంది మరణించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది. కరోనా మహమ్మారిని మించిన....మరో మహమ్మారి.. మార్బర్గ్ వైరస్ రూపంలో ప్రపంచంపై విరుచుకుపడుతోంది.
17 దేశాలను కలవరపరుస్తోంది. మార్బర్గ్ వైరస్‌ను ‘బ్లీడింగ్ ఐ’ వైరస్ అని కూడా అంటారు. ఆఫ్రికాలో కొన్నివందల మంది ఈ వైరస్ కారణంగా అనారోగ్యం బారినపడి, మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆఫ్రికాను వేధిస్తున్న ఈ వైరస్ అక్కడి నైరుతి కాంగోలో తొలిసారి బయటపడింది. ఈ అంతుచిక్కని వ్యాధి.. రువాండా కాంగో దేశాల్లో కల్లోలం రేపుతోంది. కాంగోలోని క్వాంగో ప్రావిన్సులో మారణహోమాన్ని సృష్టిస్తోంది. కేవలం 15 రోజుల్లో పలువురిని పొట్టనబెట్టుకుంది. దీంతో ఆ దేశ ఆరోగ్య అధికారులు హెల్త్ ఎమర్జెన్సీ విధించారు. మార్బర్గ్ వైరస్ సోకితే… కళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది. అందుకే దీనిని ‘బ్లీడింగ్ ఐ’ అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఈ వైరస్..ఆఫ్రికా నుంచి వ్యాపించి…ప్రపంచాన్ని చుట్టుముడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం గనులు లేదా గుహలలో ఎక్కువ కాలం నివసించే వ్యక్తులలో మార్బర్గ్ వైరస్ ముప్పు ఎక్కువగా కనిపిస్తోంది. గబ్బిలాల ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. వ్యాధి సోకిన వ్యక్తుల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దీని చికిత్సకు ఎలాంటి మందులు లేవు. నివారణ చర్యలు ఒక్కటే మార్గం అంటున్నారు వైద్యులు. పిల్లలు, మహిళలపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆలోచన అదిరిందిపో.. కుక్కల నుంచి రక్షణకు వినూత్న ప్రయోగం !!
జలుబు, దగ్గు, గొంతునొప్పికి ఇంటి చిట్కాలు
‘పుష్ప-2’ పై ట్రోల్స్.. గట్టిగా బదులిచ్చిన జాన్వీ కపూర్ !!