నీకేమో ఇద్దరు పెళ్లాలు.. నాకు మాత్రం పెళ్లి చేయవా
‘నీకేమో ఇద్దరు భార్యలు కావాలి. 35 ఏండ్లు వచ్చినా నాకు మాత్రం పెండ్లి చేయవా? నాకు పెండ్లాం అవసరం లేదా?’ అంటూ తనకు పెండ్లి చేయలేదన్న కోపంతో ఒక వ్యక్తి తన తండ్రిని కొట్టి చంపిన ఘటన కర్ణాటకలో జరిగింది. పెళ్లీడు దాటిపోతున్న తనకు తండ్రి పెళ్లి చేయడంలేదని కక్షపెంచుకున్న కొడుకు తండ్రిని దారుణంగా హతమార్చాడు.
కర్ణాటక చిత్రదుర్గ జిల్లా హోసదుర్గకి చెందిన 35 ఏళ్ల నింగరాజు తన తోటివాళ్లందరికీ వివాహాలు జరిగిపోవడం, తన తండ్రికి ఇద్దరు భార్యలున్నా..తన పెళ్లిగురించి పట్టించుకోకపోవడంతో తండ్రి నింగప్పపై కోపం పెంచుకున్న నింగరాజు రోజూ పెళ్లి విషయమై తండ్రితో గొడవపడేవాడు. నింగరాజు పనీపాటా లేకుండా, ఇటు పొలం పనులు చూసుకోకుండా జులాయిగా తిరుగుతుండటంతో తండ్రి కొడుకుల మధ్య రోజూ పెళ్లి విషయమై గొడవ జరుగుతుందని నింగప్ప చిన్న కుమారుడు పోలీసులకు తెలిపాడు. బుధవారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగిందని ఈ క్రమంలోనే తండ్రిని చంపేస్తానని నింగరాజు బెదిరించాడని తెలిపాడు. ఆ రాత్రి నింగప్ప నిద్రిస్తున్న సమయంలో నింగరాజ ఆయనను ఇనుప రాడ్డుతో కొట్టి చంపేశాడని అన్నాడు.
మరిన్ని వీడియోల కోసం :
తెలివైన రాజు..వారసత్వంగా వచ్చిన ఆస్తులు.. తెలివిగా..
బ్రష్ చేస్తుండగా చిట్లిన రక్తనాళం.. వైద్య చరిత్రలో అరుదైన వ్యాధి
నీళ్లతో నడిచే రైలు.. భారత రైల్వే ప్రారంభం
నీకేమో ఇద్దరు పెళ్లాలు.. నాకు మాత్రం పెళ్లి చేయవా
కాలానికే కన్ను కుట్టిందేమో..అందుకే ఇలా..
మహిళా దొంగల గ్యాంగ్.. నగలు కొట్టేసి ఎక్కడ దాచారో తెలుసా
వేముల వాడ ఆలయంలో నాగు పాము ప్రత్యేక్షం.. భయం భయంగా భక్తులు
గాల్లో ఎగురుతూ ఒక్కసారిగా నేలరాలుతున్న కాకులు..ఏం జరిగింది
రికార్డు స్థాయిలో వేడెక్కిన సముద్రాలు.. చరిత్రలో ఎన్నడూ లేనంతగా
షాకింగ్ వీడియో.. బస్సును ఓవర్ టెక్ చేయబోయి ప్రాణాలే వదిలాడు
