Karate Player Selling Tea: కుటుంబ పోషణకు చాయ్‌వాలాగా మారిన ప్రపంచ కరాటే ఛాంపియన్‌.. ( వీడియో )

దేశం గర్వించదగ్గ పతకాలను అందించాడు. పాతికేళ్ల వయసు నిండక ముందే 60కి పైగా పతకాలు సాధించాడు. కరాటేలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు.

|

Updated on: Jun 17, 2021 | 10:10 PM

దేశం గర్వించదగ్గ పతకాలను అందించాడు. పాతికేళ్ల వయసు నిండక ముందే 60కి పైగా పతకాలు సాధించాడు. కరాటేలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. అయితే పూట గడవక పస్తుండాల్సి వస్తోంది. దీంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు చాయ్‌వాలా అవతారమెత్తాడు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన హరిఓమ్ శుక్లా. ప్రస్తుతం మథురలో రోడ్డు పక్కన టీ అమ్ముతూ కాలం వెల్లదీస్తున్నాడు.పదునైన పంచ్‌లతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ప్రపంచఖ్యాతి గాంచిన శుక్లా.. నేడు కుటుంబ పోషణ కోసం రోడ్డెక్కి చిరువ్యాపారిగా మారాడు. దేశ, విదేశాల్లో జరిగిన అనేక పోటీల్లో పతకాలు సాధించిన ఆయన.. ఇల్లు గడవని దీనస్థితిలో కాలం వెల్లబుచ్చుతున్నాడు. ఆరేళ్ల ప్రాయంలోనే హరిఓమ్ శుక్లా కరాటేలో ఓనమాలు దిద్దుకున్నాడు. అతనికి 23 ఏళ్లు వచ్చేసరికి 60కి పైగా పతకాలు సాధించాడు. 2013లో థాయ్‌లాండ్‌లో జరిగిన జూడో కరాటే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత్‌ తరఫున స్వర్ణ పతకాన్ని సాధించి పెట్టాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Taapsee Pannu: టాలీవుడ్ మిషన్ ఇంపాజిబుల్ లో స్టార్ హీరోయిన్ తాప్సీ.. ( వీడియో )

Viral Video: తాబేలుతో ఆట ఆడుతున్న చింపాంజీ.. చిలిపి చేష్టలకు నెటిజన్లు ఫిదా.. ఫన్నీ వీడియో

Follow us