ప్చ్.. టైం దాటితే ప్రయోజనం ఉండదు.. కామారెడ్డిని వెంటాడుతున్న యూరియా కష్టాలు..
నిన్న మొన్నటి వరకు వర్షాలు వరదలతో అల్లాడిన కామారెడ్డి ప్రజల్ని ఇప్పుడు యూరియా కొరత వేధిస్తుంది. ఎరువుల కోసం అర్థరాత్రి వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రామారెడ్డి మండలం కేంద్రంలో యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు రైతులు. రామారెడ్డి సొసైటీ దగ్గర యూరియా కోసం భారీగా క్యూ కట్టారు.
నిన్న మొన్నటి వరకు వర్షాలు వరదలతో అల్లాడిన కామారెడ్డి ప్రజల్ని ఇప్పుడు యూరియా కొరత వేధిస్తుంది. ఎరువుల కోసం అర్థరాత్రి వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రామారెడ్డి మండలం కేంద్రంలో యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు రైతులు. రామారెడ్డి సొసైటీ దగ్గర యూరియా కోసం భారీగా క్యూ కట్టారు. సరిపడా యూరియా లేక తోపులాట జరగడంతో.. పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ చేశారు. యూరియా కోసం పోటెత్తిన రామారెడ్డి మండలంలోని 18 గ్రామాల రైతులు పోటెత్తగా.. 450 బస్తాలే స్టాక్ ఉందని.. అధికారులు చెప్పడంతో.. రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంటలకు అవసరమైనప్పుడే యూరియా వేయాలని, టైం దాటి పోయాక ఎరువులు వేసినా ప్రయోజనం ఉండదంటున్నారు రైతులు. ప్రభుత్వం వెంటనే యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

