UPI ఎక్కువగా వాడుతున్నారా ?? ఐటీ కళ్లు గమనిస్తుంటాయ్ జాగ్రత్త

UPI ఎక్కువగా వాడుతున్నారా ?? ఐటీ కళ్లు గమనిస్తుంటాయ్ జాగ్రత్త

Phani CH

|

Updated on: Nov 22, 2024 | 7:56 PM

దేశంలో రోజురోజుకీ డిజిటల్‌ పేమెంట్స్ హవా పెరుగుతోంది. బ్యాంకులకు వెళ్లాల్సిన పనిలేకుండా స్మార్ట్‌ ఫోన్‌తోనే పని చేస్తున్నారు. ఒకప్పుడు వేరే వారి ఖాతాలో డబ్బులు వేయాలంటే బ్యాంకుకు వెళ్లి లైన్‌లో నిలబడి, వోచర్‌ నింపడం ఇలా పెద్ద కథ ఉండేది. కానీ ప్రస్తుతం అంతా మారిపోయింది. సెకనులో డబ్బులు పంపించుకునే రోజులు వచ్చేశాయి.

డిజిటల్ పేమెంట్స్‌లో అత్యధికం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం ఇలా రకరకాల యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ.. యూపీఐ యాప్స్‌ను ఎక్కువగా ఉపయోగించం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ మొత్తంలో యూపీఐ లావాదేవీలు చేసే వారిపై ఆదాయపు పన్ను విభాగం నిఘా పెడుతోంది. బ్యాంక్‌ అకౌంట్‌లో పరిమితికి మించి నగదు జమ కావడం, ఎక్కువ మొత్తంలో విత్‌డ్రా చేసుకున్న ఆదాయపు పన్ను దేశ అధికారులు నిఘా పెడుతున్నారు. ఇలాంటి వారికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నోటీసులు పంపించే అవకాశం ఉంది. దీంతో పన్నులు, పెనాల్టీలు చెల్లించాలని అధికారులు నేరుగా ఇంటికి నోటీసులు పంపించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. రోజువారీ లావాదేవీలపై నిఘా పెట్టేందుకు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నారు. పరిమితికి మించి ట్రాన్సాక్షన్స్‌ చేసే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. సాధారణంగా సేవింగ్స్‌ అకౌంట్‌లో ఒక ఏడాది 10 లక్షల రూపాయిల లిమిట్ ఉంటుంది. ఈ లిమిట్‌ దాటితే వెంటనే వివరాలు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ విభాగానికి వెళ్తాయి. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 285 బీఏ కింద బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేసేందుకు పరిమితి ఉంటుంది. అలాగే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో సేవింగ్స్ ఖాతాలో జమ అయిన డబ్బుల వివరాలు సరిపోకపోతే మీకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్కూల్ బ్యాగ్‌ లో వింత శబ్దాలు !! తెరిచి చూసినవారి గుండె గుభేల్

గొంతు నొప్పితో ఆస్పత్రికి వెళ్తే.. కడుపొచ్చిందన్నారు !!

మెకానిక్ రాఖీ హిట్టా ?? ఫట్టా ?? తెలియాలి అంటే.. ఈ వీడియో చూడాలి కదా..