ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో శుక్రవారంనాడు ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆలింగనం చేసుకున్నారు. అసెంబ్లీ వెలుపల ఈ ఘటన చోటు చేసుకుంది. వైసీపీకి చెందిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు పక్కకు వెళ్లిపోగా.. బొత్స ఎదురుగా నిలబడి పవన్‌కు నమస్కారం పెట్టారు.