కొడుకు అంటే తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో ఈ వీడియోను చూస్తే అర్థమవుతుంది. ఆర్మీలో పనిచేసే ఓ జవాను సెలవుపై ఇంటికి వెళ్లాడు. తాను వస్తున్నట్టు ముందుగా ఎవరికీ చెప్పలేదు. నేరుగా తన తల్లి కొబ్బరి బోండాలు అమ్మే చోటుకు ఓ కస్టమర్ లా వెళ్లాడు. ఆర్మీ యూనిఫాంలో ముఖానికి మాస్క్ తో ఉన్న కొడుకును ఆ తల్లి గుర్తుపట్టలేదు.